Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Focus » Swayamvaram: 23 ఏళ్ళ ‘స్వయంవరం’ మూవీ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

Swayamvaram: 23 ఏళ్ళ ‘స్వయంవరం’ మూవీ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

  • April 23, 2022 / 04:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Swayamvaram: 23 ఏళ్ళ ‘స్వయంవరం’ మూవీ గురించి  10 ఆసక్తికర విషయాలు..!

తొట్టెంపూడి వేణు హీరోగా లయ హీరోయిన్ గా కె.విజయ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్వయంవరం’. 1999 వ సంవత్సరంలో ఏప్రిల్ 22న ఈ మూVవీ రిలీజ్ అయ్యింది. ‘ఎస్.పి.ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ పై వెంకట్ శ్యామ్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ ఆ ఏడాదికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది.ప్రేమకి పెళ్ళికి మధ్య సతమతమయ్యే ఓ కుర్రాడి కధే ఈ ‘స్వయంవరం’. నేటితో ఈ మూవీ విడుదలై 23 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో ‘స్వయంవరం’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం రండి :

1)’స్వయంవరం’ మూవీ ద్వారా తొట్టెంపూడి వేణు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నిజానికి ఇతను సీనియర్ స్టార్ డైరెక్టర్ భారతీ రాజా దర్శకత్వంలో హీరో ఎంట్రీ ఇవ్వాలి. వీళ్ళ కాంబినేషన్లో ఓ మూవీ కూడా మొదలైంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయింది.

2) ఆ టైములో వెంకట్ శ్యామ్ ప్రసాద్… ‘ఎస్.పి.ఎంటర్టైన్మెంట్స్’ అనే సంస్థని స్థాపించి ఓ సినిమా నిర్మించాలని చూస్తున్నాడు. ఇతని హీరో వేణుకి మంచి స్నేహితుడు కావడం.. పైగా వేణు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉండడంతో ఇతన్ని హీరోగా లాక్ చేసుకున్నాడు.

3) ఈ నేపథ్యంలో వెంకట్ శ్యామ్ ప్రసాద్ కథల అన్వేషణ మొదలైంది. అతని వద్దకి వచ్చే కథలన్నీ పెద్ద బడ్జెట్ తో కూడుకున్న కథలు. మొదటి సినిమాతోనే అంత రిస్క్ చేసే ఆలోచన ఆ టైములో అతనికి లేదు.

4) ఈ నేపథ్యంలో ఓ రోజు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే కుర్రాడు వచ్చి రెండు కథలు వినిపించాడు. అందులో ఒకటి క్లాస్ స్టోరీ కావడం.. దానికి ‘స్వయంవరం’ అనే టైటిల్ ఫిక్స్ చేయడం జరిగిపోయింది. అయితే ఇప్పుడు ఈ కథని డీల్ చేసే దర్శకుడు కావాలి. త్రివిక్రమ్ కు ఆ టైములో డైరెక్షన్ చేసే ఉద్దేశం లేదు. అతనికి ఆ టైములో డైరెక్షన్ పై అవగాహన కూడా లేదు. మరో పక్క నిర్మాత వెంకట్ శ్యామ్ ప్రసాద్ కూడా కొత్త వాళ్ళతో సినిమా చేసే ఉద్దేశంలో లేదు. అయితే త్రివిక్రమ్ కథ చెప్పిన విధానం నచ్చి అతనైతే ఓకె అని చెప్పాడట. కానీ ఆ టైములో మన గురూజీకే ఇంట్రెస్ట్ లేదు.

5) ఇలాంటి టైములో వెంకట్ శ్యామ్ ప్రసాద్ కు విజయ భాస్కర్ పరిచయమయ్యాడు. విజయ భాస్కర్ గారు ఆల్రెడీ ‘ప్రార్థన’ అనే మూవీతో డైరెక్టర్ గా మారారు. 1991 వ సంవత్సరంలో సురేష్ హీరోగా వచ్చిన ఆ మూవీ పెద్ద ప్లాప్ అయ్యింది. కానీ ఆ సినిమా లైన్ బాగుంటుంది. టేకింగ్ సీరియస్ గా ఉండడంతో జనాలకి కనెక్ట్ కాలేదు. దాంతో ఒక సినిమాని డైరెక్ట్ చేసిన అనుభవం ఉంది కాబట్టి.. విజయభాస్కర్ గారిని దర్శకుడిగా ఫైనల్ చేశారు శ్యామ్ ప్రసాద్.

6) ‘భద్రం కొడుకో’ అనే చిన్న పిల్లల మూవీలో నటించిన లయ ని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. వేణు, లయ పెయిర్ కొత్తగా చాలా ఫ్రెష్ గా అనిపించింది.

7) నక్సలిజం బ్యాక్ డ్రాప్ సినిమాలకి సంగీతం అందించే వందేమాతరం శ్రీనివాస్ ను.. ఈ మూవీకి సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. ఆయన ఈ చిత్రానికి ఆహ్లాదకరమైన సంగీతాన్ని అందించారు. ‘పికాసో చిత్రమా’ ‘కీరవాణి రాగంలో’ వంటి పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.

8) త్రివిక్రమ్ రైటింగ్ కు విజయ భాస్కర్ టేకింగ్ కు వేణు నటనకి.. చాలా బాగా కుదిరింది. ఈ మూవీలో కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యింది.

9)అనుకున్న దానికంటే కూడా ఇంకా ముందుగానే సినిమాని కంప్లీట్ చేసి విడుదల చేశారు.చాలా చోట్ల నిర్మాత అడ్వాన్స్ బేసిస్ మీద ఓన్ రిలీజ్ చేసుకున్నాడు. మొదటి రోజు థియేటర్లలో జనాలు పెద్దగా లేరు. కానీ ఈవెనింగ్ షోలకి మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి పలు చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి. రెండో రోజు నుండీ ఈ మూవీ పుంజుకుంది. తొలివారంలోనే ఈ మూవీకి నిర్మాత పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కి వచ్చేసింది. ఫుల్ రన్లో నిర్మాతకి భారీ లాభాలను అందించింది.

10) విజయ్ భాస్కర్ కు లైఫ్ ఇచ్చిన మూవీ ఇదైతే.. వేణు, లయ, త్రివిక్రమ్ లకి శుభారంభాన్ని ఇచ్చిన మూవీగా నిలిచింది.

11) ఆ ఏడాదికి గాను ఉత్తమ సంగీతం, స్పెషల్ జ్యురీ, బెస్ట్ సింగర్ కేటగిరీల్లో 3 నంది అవార్డులు దక్కించుకుంది ఈ మూవీ.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Laya
  • #Swayamvaram
  • #venu
  • #Vijaya Bhasker

Also Read

Telusu Kada: ‘తెలుసు కదా’ సెన్సార్ కు బలైన సన్నివేశాలు ఇవే!

Telusu Kada: ‘తెలుసు కదా’ సెన్సార్ కు బలైన సన్నివేశాలు ఇవే!

Brindavanam Collections: 15 ఏళ్ళ ‘బృందావనం’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Brindavanam Collections: 15 ఏళ్ళ ‘బృందావనం’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ కోసం ఎదురీదుతున్న ‘కాంతార చాప్టర్ 1’..!

Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ కోసం ఎదురీదుతున్న ‘కాంతార చాప్టర్ 1’..!

OG Collections: ‘ఓజి’ కలెక్షన్స్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు..!

OG Collections: ‘ఓజి’ కలెక్షన్స్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు..!

Meesaala Pilla Song: ‘మీసాల పిల్లా’ సాంగ్ రివ్యూ.. నెగిటివ్ ఒపీనియన్స్ అన్నీ మారిపోయేలా..!

Meesaala Pilla Song: ‘మీసాల పిల్లా’ సాంగ్ రివ్యూ.. నెగిటివ్ ఒపీనియన్స్ అన్నీ మారిపోయేలా..!

పవన్‌కి అంకుల్‌ హిట్‌ ఇచ్చారు.. మరి అబ్బాయి కూడా హిట్టిస్తాడా?

పవన్‌కి అంకుల్‌ హిట్‌ ఇచ్చారు.. మరి అబ్బాయి కూడా హిట్టిస్తాడా?

related news

Chiranjeevi, Balayya Babu: బాలయ్య పై మళ్ళీ పైచేయి సాధించి తన రేంజ్ ఏంటో చాటిచెప్పిన చిరు..!

Chiranjeevi, Balayya Babu: బాలయ్య పై మళ్ళీ పైచేయి సాధించి తన రేంజ్ ఏంటో చాటిచెప్పిన చిరు..!

Pradeep Ranganathan: ప్రభాస్  సినిమా టైటిల్ లీక్ చేసిన ప్రదీప్ రంగనాథన్!

Pradeep Ranganathan: ప్రభాస్ సినిమా టైటిల్ లీక్ చేసిన ప్రదీప్ రంగనాథన్!

Telusu Kada: ‘తెలుసు కదా’ సెన్సార్ కు బలైన సన్నివేశాలు ఇవే!

Telusu Kada: ‘తెలుసు కదా’ సెన్సార్ కు బలైన సన్నివేశాలు ఇవే!

Brindavanam Collections: 15 ఏళ్ళ ‘బృందావనం’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Brindavanam Collections: 15 ఏళ్ళ ‘బృందావనం’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ కోసం ఎదురీదుతున్న ‘కాంతార చాప్టర్ 1’..!

Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ కోసం ఎదురీదుతున్న ‘కాంతార చాప్టర్ 1’..!

OG Collections: ‘ఓజి’ కలెక్షన్స్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు..!

OG Collections: ‘ఓజి’ కలెక్షన్స్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు..!

trending news

Telusu Kada: ‘తెలుసు కదా’ సెన్సార్ కు బలైన సన్నివేశాలు ఇవే!

Telusu Kada: ‘తెలుసు కదా’ సెన్సార్ కు బలైన సన్నివేశాలు ఇవే!

35 mins ago
Brindavanam Collections: 15 ఏళ్ళ ‘బృందావనం’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Brindavanam Collections: 15 ఏళ్ళ ‘బృందావనం’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

54 mins ago
Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ కోసం ఎదురీదుతున్న ‘కాంతార చాప్టర్ 1’..!

Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ కోసం ఎదురీదుతున్న ‘కాంతార చాప్టర్ 1’..!

1 hour ago
OG Collections: ‘ఓజి’ కలెక్షన్స్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు..!

OG Collections: ‘ఓజి’ కలెక్షన్స్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు..!

3 hours ago
Meesaala Pilla Song: ‘మీసాల పిల్లా’ సాంగ్ రివ్యూ.. నెగిటివ్ ఒపీనియన్స్ అన్నీ మారిపోయేలా..!

Meesaala Pilla Song: ‘మీసాల పిల్లా’ సాంగ్ రివ్యూ.. నెగిటివ్ ఒపీనియన్స్ అన్నీ మారిపోయేలా..!

6 hours ago

latest news

Netflix: నెట్‌ఫ్లిక్స్‌ మరోసారి పాత లిస్టే  బయటపెట్టింది.. అయినా ఇప్పుడెందుకబ్బా!

Netflix: నెట్‌ఫ్లిక్స్‌ మరోసారి పాత లిస్టే బయటపెట్టింది.. అయినా ఇప్పుడెందుకబ్బా!

3 hours ago
Bison Trailer: ‘బైసన్‌’ వచ్చేశాడు.. కబడ్డీ నేపథ్యంలో విక్రమ్‌ కొడుకు మ్యాజిక్‌ చేస్తాడా?

Bison Trailer: ‘బైసన్‌’ వచ్చేశాడు.. కబడ్డీ నేపథ్యంలో విక్రమ్‌ కొడుకు మ్యాజిక్‌ చేస్తాడా?

4 hours ago
ఎట్టకేలకు ఆ దర్శకుడి సినిమా ఫిక్స్‌.. హీరో సల్మాన్‌ ఖాన్‌ అట!

ఎట్టకేలకు ఆ దర్శకుడి సినిమా ఫిక్స్‌.. హీరో సల్మాన్‌ ఖాన్‌ అట!

4 hours ago
War 2: ‘వార్‌ 2’ని లేపుతున్న ఆర్మాక్స్‌.. రికార్డు స్థాయి వీక్షణలంటూ…

War 2: ‘వార్‌ 2’ని లేపుతున్న ఆర్మాక్స్‌.. రికార్డు స్థాయి వీక్షణలంటూ…

7 hours ago
‘మడాక్‌’ విశ్వంలోకి మత్తు కళ్ల సుందరి.. ఎలా కనిపిస్తుందో మరి!

‘మడాక్‌’ విశ్వంలోకి మత్తు కళ్ల సుందరి.. ఎలా కనిపిస్తుందో మరి!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version