ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో చదువుకున్న సాత్విక్ అనూహ్యంగా తెలుగు సినిమా దర్శకుడిగా మారాడు. తన కార్పొరేట్ ఆశయాలను సైతం పక్కనపెట్టి మెగాఫోన్ పట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే…
తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన సాత్విక్ ఐఐఎం విశాఖపట్నం నుండి పట్టభద్రుడయ్యాడు. చిన్నప్పటినుండి సినిమాల మీద ఉన్న ప్యాషన్ తో తాను చాలా మంచి చిత్రాలని తెలుగు ప్రేక్షకులకి అందించాలని కలలు కన్నాడు. మేనేజ్మెంట్ లో తనకి ఉన్న నైపుణ్యాన్ని సినిమాల్లో ఉపయోగిస్తే చక్కటి ఫలితాలని అందుకోవచ్చని సాత్విక్ విశ్వసించాడు.
ఈ క్రమంలో దర్శకుడిగా తన తొలి చిత్రం “వైభవం” ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ చిత్రంతో రుత్విక్, ఇక్రా ఇద్రిసితో పాటు పలువురు కొత్త నటీనటులు పరిచయం కానున్నారు. మరి తెలుగు సినిమాల్లో సాత్విక్ తనదైన మార్క్ ను ఏర్పర్చుకోగలడా అన్నది వేచి చూడాలి!!