Samantha : సమంత నెక్స్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’ టైటిల్స్ కార్డ్స్ లో సర్ప్రైజ్ ఏంటో తెలుసా..?
- January 29, 2026 / 03:52 PM ISTByFilmy Focus Desk
సమంత ఈ పేరు కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ నుంచి మొదలయిన తన ప్రస్థానం బాలీవుడ్ వరకు స్టార్ హీరోయిన్ గా ఎదగటం అంటే మాములు విషయం కాదు. ఒకానొక టైం లో అయితే స్టార్ హీరోలను సైతం డామినేట్ చేసేంత అభిమానాన్ని పొందగలిగారు సమంత. తన అందంతోనే కాక నటన తోను సిల్వర్ స్క్రీన్ పై ఆడియన్స్ ను మంత్రముగ్దులు చేసేది ఈ భామ. సినీ జీవితంలో అభిమానుల కలల రాణి గా ఎదిగిన సమంత, తన నిజ జీవితంలో ముఖ్యంగా పెళ్లి మరియు ఆ తరువాత ఆరోగ్య సంబంధిత ఇబ్బందులతో ఒడిదుడుకులు ఎదురుకుంది. అయినా కానీ వాటన్నిటిని సమర్ధంగా ఎదుర్కొని దర్శకుడు రాజ్ నిడుమోరు తో రెండవ వివాహం ద్వారా రీసెంట్ గానే కొత్త జీవితం ప్రారంభించింది. ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్న సమంత గురించి ఒక వార్త వైరల్ గా మారింది. అదేంటంటే..
Samantha
ఇక విషయానికొస్తే.. రాజ్ నిడుమోరు తో వివాహం తరువాత సమంత వర్క్ చేస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’ టైటిల్ కార్డ్స్ లో సమంత అభిమానులకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారట. నాగ చైతన్యతో విడాకుల తరువాత సమంత నటించిన మూవీస్ లో తన పేరు కేవలం సమంతగా మాత్రమే పడుతుండగా, ఇక నుంచి భర్త రాజ్ నిడిమోరు ఇంటిపేరును సమంత తన సినిమా టైటిల్ కార్డ్స్ లో సమంత నిడిమోరు గా పెట్టుకోవాలని డిసైడ్ అయ్యిందని సమాచారం. ఇదే నిజమైతే ‘మా ఇంటి బంగారం’ సినిమా నుంచే సమంత నిడిమోరు గా వెండితెరపై చూడవచ్చు. ఇక ఈ సినిమాకు తెలుగు లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తుంది.















