ఎనిమిదేళ్ల మ్యారేజ్ లైఫ్ పై ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు!

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ని పెళ్లాడిన ఉపాసన కామినేని తనదైన వ్యక్తిత్వంతో ప్రజల ప్రేమను పొందింది. పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ, అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తూ.. తనవంతు సేవ చేస్తోంది. చరణ్ భార్యగా కంటే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే రామ్ చరణ్ తో తన ప్రేమ, పెళ్లి విషయాల గురించి ఉపాసన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. చరణ్ తో ఆమె వివాహ బంధానికి ఎనిమిదేళ్లు.

ఈ క్రమంలో తమ మధ్య పెనవేసుకున్న ప్రేమ బంధం గురించి మనసులో మాటను బయట పెట్టింది ఉపాసన. పెళ్లి తరువాత వచ్చిన మొదటి వాలెంటైన్స్ డే సమయంలో చరణ్ తనకు చక్కని గిఫ్ట్ ఇచ్చాడని ఉపాసన గుర్తుచేసుకుంది. హార్ట్ షేప్ లో ఉన్న చెవి రంగులను తయారు చేయించి చరణ్ తనకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడని చెప్పింది. తమ ఎనిమిదేళ్ల వైవాహిక బంధం చాలా సంతోషంగా గడిచిందని తెలిపింది. తమ మధ్య ఎన్నో అపురూప క్షణాలున్నాయని వెల్లడించింది.

అలానే అప్పుడప్పుడు ఇద్దరి మధ్య విభేదాలు వస్తుంటాయని.. గొడవలు కూడా జరుగుతుంటాయని వెల్లడించింది. భార్యా, భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడే ఆ బంధం మరింత బలంగా మారుతుందని చెప్పుకొచ్చింది. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఇద్దరం కలిసి ఎదుర్కొంటూ సక్సెస్ ఫుల్ గా లైఫ్ లీడ్ చేస్తున్నట్లు ఉపాసన చెప్పుకొచ్చింది.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus