Upasana: విలేజ్‌ డెవలప్‌మెంట్‌ కోసం తన చెవి రింగులను డొనేషన్‌గా ఇచ్చిన ఉపాసన!

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ భార్య ఉపాసన సేవా గుణం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఛారిటీల కోసం ఆమె ఎన్నో చేస్తుంటారు. తాజాగా మరోసారి ఆమె దాతృత్వాన్ని చాటుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఓ గోల్డ్‌ స్టోర్‌ ప్రారంభానికి ఉపాసన అతిథిగా హాజరయ్యారు. ఆ స్టోర్‌ ప్రారంభం ద్వారా వచ్చిన రెమ్యూనరేషన్‌ మొత్తాన్ని దోమకొండ పోర్ట్‌, విలేజ్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌కు విరాళంగా ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. అణగారిన, అట్టడుగు స్థాయిలో ఉన్నవారిని ఆదుకోవడానికి, ఆర్థిక స్థిరత్వం, మహిళా సాధికారతను (women empowerment) ప్రోత్సహించడానికి ఈ ట్రస్ట్‌ ముఖ్య లక్ష్యం.

‘జోయా’ స్టోర్‌లో ఆమెకు గిప్ట్‌గా ఇచ్చిన ఖరీదైన చెవి రింగులను దోమకొండ పోర్ట్‌, విలేజ్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌కు డొనేషన్‌గా ఇచ్చారు. అలాగే ట్రస్ట్‌కు, మహిళా సాధికారితకు సహకరిస్తామన్నా జోయా యాజమన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆమె చేసిన సాయానికి నెటిజన్లు హర్షిస్తున్నారు. ‘ఉపాసన బంగారంలాంటి మహిళ, మీ సహాయ గుణానికి అభినందనలు’ అని సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ఇటీవల దుబాయ్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో సీమంతం నిర్వహించుకున్న (Upasana) ఆమె, భర్త రామ్‌చరణ్‌తో కలిసి హైదరాబాద్‌ చేరుకున్నారు. త్వరలోనే రామ్‌చరణ్‌ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ వార్త తెలిసినప్పటి నుంచి మెగా ఫ్యామిలీతోపాటు అభిమానులు ఎంతో క్లౌడ్‌నైన్‌లో ఉన్నారు. రామ్‌చరణ్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్‌ – చరణ్‌ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. దిల్‌రాజు నిర్మిస్తున్నారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus