మెగా కోడలు ఉపాసనకు ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రామ్ చరణ్ భార్యగానే కాకుండా పలు సేవా కార్యక్రమాల ద్వారా ఉపాసన తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవడం గమనార్హం. తాజాగా అత్యాధునిక ఫీచర్లు ఉన్న ఆడి ఈ ట్రాన్ కారును ఉపాసన కొనుగోలు చేశారు. ఉపాసన కొనుగోలు చేసిన ఈ కారు విలువ కోటీ 20 లక్షల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని తెలుస్తోంది. ఉపాసన సోషల్ మీడియాలో కొత్త కారుకు సంబంధించిన వీడియో షేర్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఉపాసన షేర్ చేసిన వీడియోకు రికార్డు స్థాయిలో లైక్స్ వస్తున్నాయి. మెగా అభిమానులు కంగ్రాట్స్ వదిన అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఉపాసన కారు లగ్జరీగా ఉండటంతో పాటు కారు కలర్ కూడా బాగుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఉపాసన కొనుగోలు చేసిన కారు మెగా రేంజ్ కు తగిన కారు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రామ్ చరణ్ కెరీర్ లో సక్సెస్ అయిన విషయంలో ఉపాసన పాత్ర కూడా కొంత ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
పెళ్లి తర్వాతే రామ్ చరణ్ కెరీర్ మరింత పుంజుకుందని చరణ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో సినిమాలో నటించడంతో పాటు పలు వ్యాపారాలతో బిజీగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఈ ఏడాది రామ్ చరణ్ ఖాతాలో బిగ్గెస్ట్ హిట్ చేరిందనే సంగతి తెలిసిందే. ఆచార్య సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా చరణ్ కెరీర్ పై ఆ సినిమా ప్రభావం పెద్దగా పడలేదు.
చరణ్ సినిమా విడుదలైతే తొలిరోజే థియేటర్ లో ఉపాసన ఆ సినిమాను చూడటంతో పాటు సినిమాకు సంబంధించిన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకుంటున్నారు. చరణ్ ఉపాసన ఒకే సినిమాలో కలిసి కనిపిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫ్యాన్స్ కోరికను మన్నించి ఉపాసన భవిష్యత్తులో చరణ్ సినిమాల్లో కనిపిస్తారేమో చూడాలి.