Upendra: ఉపేంద్ర కొత్త సినిమాకు ‘కల్కి 2898 ఏడీ’కి లింక్‌.. ఏంటంటే?

భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకుల్ని అలరించిన హీరోలు తక్కువగా ఉంటారు. అది కూడా ఎవరూ ఊహించని అంశాలతో సినిమాలు తెరకెక్కించి మరీ అలరిస్తుంటారు. అలాంటి నటుల్లో ఉపేంద్ర (Upendra) ఒకరు. ఆయన సినిమాల కథల ఎంపిక మామూములగా ఉండదు. తాజాగా ఆయన నుండి వస్తున్న చిత్రం ‘యూఐ’ (UI). ఈ సినిమాను ఈ నెల 20న విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఈ సినిమా భవిష్యత్తు గురించి చెప్పే కథతో తెరకెక్కింది అనే వార్తలు వస్తున్నాయి.

Upendra

ఇదే మాట ఆయన దగ్గర ప్రస్తావిస్తే.. మన భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పడానికి నేనేమీ జ్యోతిష్యుడిని కాదు కదా అని నవ్వేశారు. అయితే తమ సినిమా కథ ‘కల్కి 2898 ఏడీ’ని (Kalki 2898 AD) పోలి ఉంటుంది అని చెప్పారు. అయితే ఆ సినిమా మైథలాజికల్‌ ‘కల్కి’ మాది సైకలాజికల్‌ ‘కల్కి’ అని చెప్పారు ఉపేంద్ర. సినిమాల్లో చాలా మంది బయట జరిగిన కథల్ని చెబుతుంటారని, తాను మాత్రం మనుషుల్లో నిగూఢమై ఉన్న కథల్ని చెప్పడానికి ప్రయత్నిస్తుంటా అని చెప్పారు.

సినిమా తెరకెక్కిస్తున్నప్పుడు ప్రేక్షకుడే అసలైన స్టార్‌ అని తాను అనుకుంటున్నానని, కేవలం దర్శకుడిగా తన పని చేస్తా అని చెప్పారు ఉపేందర. అందుకేనే తన సినిమాలు ప్రేక్షకుడితో మాట్లాడుతుంటాయని, వాళ్లలో ఆలోచనలు రేకెత్తిస్తుంటాయని చెప్పాడు. అలా అని సందేశాలు ఇవ్వడం తన ఆలోచన కాదని చెప్పిన ఉపేంద్ర.. థియేటర్‌కి ప్రేక్షకుడు వినోదం కోసమే వస్తాడనే విషయం గుర్తించాలని అన్నాడు. ప్రేక్షకులు కోరుకునే వాణిజ్యాంశాలను తన సినిమాల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంటా అని చెప్పాడు.

ఈ సినిమా ఓ మంచి కమర్షియల్‌ కథ అని, విజువల్‌గా, మ్యూజికల్‌గా కొత్త అనుభూతిని పంచుతుందని చెప్పారు. తన సినిమాలను రెండు భాగాలుగా తీయాలనే ఆలోచన ఎప్పుడూ కలగలేదు అని చెప్పిన ఉపేంద్ర.. ‘యుఐ’ సినిమా చూసిన తర్వాత రెండో భాగం కావాలని ప్రేక్షకులు అంటే.. అప్పుడు ఆలోచిస్తా అని చెప్పారు ఉపేంద్ర.

బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ కి .. ఎన్ని లక్షల ప్రైజ్ మనీ వచ్చిందో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus