ప్రముఖ నటుడు దర్శకుడు ఉపేంద్ర ఒకప్పుడు భిన్నమైన సినిమాలతో సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నిలిచేవారు. అతను ఎలాంటి సినిమాలు చేసినా కూడా అప్పట్లో తెలుగులో కూడా మంచి క్రేజ్ అందుకునేవి. మొన్న తీసిన రోబో కాన్సెప్ట్ కూడా 90ల కాలంలోనే ఉపేంద్ర చేసేశాడు. ఎన్నో వైవిధ్యమైన మంచి అంశాలను కూడా తనదైన శైలిలో డైరెక్ట్ చేసి హైలెట్ చేసేవాడు. అయితే ఉపేంద్రకు ఒకానొక సమయంలో మెగాస్టార్ చిరంజీవి ని డైరెక్ట్ చేసే అవకాశం కూడా వచ్చిందట.
ఆ విషయాన్ని ఇటీవల వరుణ్ తేజ్ సినిమా గని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలియజేశాడు. ఆ చాన్స్ మిస్ అయినందుకు ఇప్పటికి కూడా బాధపడుతూ ఉంటాను అని ఉపేంద్ర తెలియజేయడం విశేషం. వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని సినిమా ఈనెల 8న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించగా ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సినిమాలో ఉపేంద్ర కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈవెంట్లో ఉపేంద్ర మెగా ఫ్యామిలీ తో ఉన్న అనుబంధాన్ని గురించి తెలియజేశాడు. మెగాస్టార్ తో తనకు మంచి అనుబంధం ఉంది అంటూ ఒకానొక సమయంలో మెగాస్టార్ చిరంజీవి డైరెక్ట్ చేసే అవకాశం కూడా వచ్చింది అని తెలియజేశారు. 24 ఏళ్ల క్రితం రాజశేఖర్ తో ఓంకారం అనే సినిమా చేయడం జరిగింది. అయితే అదే సమయంలో నిర్మాత సి.అశ్వనీదత్ మెగాస్టార్ తో సినిమా చూసే అవకాశం ఇస్తానని అన్నారు.
కానీ కొన్ని కారణాల వలన మెగాస్టార్ చిరంజీవిని అప్పుడు నేను డైరెక్ట్ చేయలేకపోయాను. ఆ చాన్స్ మిస్ అయినందుకు నేను ఇప్పటికీ బాధపడుతూనే ఉంటాను అని ఉపేంద్ర వివరణ ఇచ్చాడు. ప్రస్తుతం ఉపేంద్ర కన్నడ లో రెగ్యులర్ హీరోగా మాత్రమే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా పలు ఆసక్తికరమైన పాత్రలతో కనిపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక గని లో కూడా అతని పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని తెలుస్తోంది.