ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పెండింగ్ సినిమాలు కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఎన్నికల తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉన్న పవన్… నిర్మాతల టెన్షన్ ను అర్థం చేసుకుని తన 3 సినిమాలను కంప్లీట్ చేయడానికి రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ‘హరిహర వీరమల్లు’ సినిమాని కంప్లీట్ చేశారు. జూలై 24న ఈ సినిమా విడుదల కానుంది. మొదట్లో ఈ సినిమాపై పవన్ అభిమానులకి కూడా ఇంట్రెస్ట్ లేదు.
కానీ ట్రైలర్ తో అంచనాలు పెంచారు. అయితే పవన్ అభిమానులకు కిక్ ఇచ్చే ప్రాజెక్టులు అంటే ‘ఓజి’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే చెప్పాలి. సుజిత్ డైరెక్ట్ చేసిన ‘ఓజి’ గ్లింప్స్ తో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వేరు. అలాగే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు.
పైగా ‘మైత్రి మూవీ మేకర్స్’ నిర్మాతలు. వాళ్ళు పెద్ద సినిమా చేస్తే కచ్చితంగా అది బ్లాక్ బస్టర్ అనే నమ్మకం జనాల్లో ఉంది. ఇదిలా ఉండగా.. ‘ఓజి’ షూటింగ్ దాదాపు కంప్లీట్ అయ్యింది. చిన్న ప్యాచ్ వర్క్ ఉంటే రసూల్ పుర వంటి ఏరియాల్లో చేస్తున్నారు. ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి కూడా వరుస డేట్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.
ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. డిసెంబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుందట. అటు తర్వాత సంక్రాంతి వరకు గ్యాప్ ఇచ్చి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టి..2026 మే 8న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు వినికిడి. ‘గబ్బర్ సింగ్’ కూడా మేలోనే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కొట్టింది.