మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 సినిమాతో పూర్వవైభవాన్ని సొంతం చేసుకున్నారు. ఈ మూవీ విజయం ఇచ్చిన ఉత్సాహంతో 151 సినిమాకు సిద్ధమవుతున్నారు. ఈ ఫిల్మ్ ని కూడా రామ్ చరణే నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ డైరక్టర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయింది. వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీకి మొదట “ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి” అనే టైటిల్ నే అనుకున్నారు. కానీ ఇప్పుడు పేరు మార్చినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. కారణం ఏమిటని ఆరాతీస్తే అసలు విషయం బయటపడింది.
“ఉయ్యాలవాడ” పేరు పెట్టడం వల్ల తెలుగువారు మాత్రమే కనెక్ట్ అవుతారని, ఇతర భాషల్లోనూ విజయం సాధించాలంటే కామన్ టైటిల్ ఉండాలని చిత్రబృందం భావించినట్లు తెలిసింది. అందుకే మహా వీర అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీలో మంచి కలక్షన్స్ రాబట్టాలని అక్కడి పరిశ్రమకు చెందిన ఆర్టిస్టులను, టెక్నీషియన్లను ఈ టీమ్ లో తీసుకుంటున్నారు. సంగీత దర్శకుడిగా ఏ ఆర్ రెహమాన్ ఖరారు కాగా, హీరోయిన్ గా ఐశ్వర్యారాయ్, సోనాక్షి సిన్హా పేర్లు పరిశీలనలో ఉన్నాయి. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.