ప్రపంచం ఎంతటి ఆధునికతను సంతరించుకున్నా కొన్ని సెంటిమెంట్స్ ను మాత్రం గట్టిగా ఫాలో అవుతుంటాం. ఎన్ని జనరేషన్స్ మారినా ఈ సెంటిమెంట్ అనేది మాత్రం చాలా కామన్ ఫ్యాక్టర్. ఇక మన సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. మనోళ్లు కథ లేకుండా అయినా సినిమా తీస్తారేమో కానీ.. సెంటిమెంట్ లేకుండా, ఫాలో అవ్వకుండా మాత్రం తీయరు. సో, ఇండస్ట్రీలో ఒక్కొక్కళ్ళకి ఒక్కో సెంటిమెంట్ ఉన్నట్లే.. మెగా కాంపౌండ్ నుంచి వచ్చే హీరోలకు కూడా ఒక సెంటిమెంట్ ఉంటుంది.
అదేమిటంటే.. హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాక రెండో సినిమా మాత్రం కచ్చితంగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే చేయాలి. ఆల్రెడీ మెగా హీరోలు రామ్ చరణ్ తన తోలి చిత్రం “చిరుత” అనంతరం రెండో సినిమా “మగధీర”, సాయితేజ్ “పిల్లా నువ్వు లేని జీవితం” సినిమాలను గీతా సంస్థ నిర్మించింది. రెండూ మంచి విజయాలు సాధించాయి. అల్లు అర్జున్ మాత్రం రెండో సినిమా కాక మూడో సినిమా హ్యాపీ సొంత బ్యానర్ లో చేసాడు. అందుకే అది ఫ్లాప్ అయ్యిందేమో.
ఇకపోతే.. మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్ తోలి చిత్రం “ఉప్పెన” రిలీజ్ కి రెడీగా ఉంది. దాంతో సెకండ్ సినిమాకి సన్నాహాలు మొదలయ్యాయి. డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ప్రస్తుతానికి నందిని రెడ్డి పేరు మాత్రం వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని గీతా సంస్థ నిర్మించనుంది. సో, రామ్ చరణ్, సాయితేజ్ ల తరహాలో వైష్ణవ్ తేజ్ కూడా మంచి హిట్ కొడతాడేమో చూడాలి.