ఇటీవల జరిగిన ఓ డబ్బింగ్ సినిమా వేడుకలో టాలీవుడ్ నిర్మాత ఎస్.కె.ఎన్ (SKN) “తెలుగు హీరోయిన్లను ఎంకరేజ్ చేస్తే ఏం జరుగుతుందో మాకు తర్వాత తెలిసొచ్చింది. అందుకే భవిష్యత్తులో నేను, సాయిరాజేష్ (Sai Rajesh Neelam) తెలుగు అమ్మాయిలని ఎంకరేజ్ చేయం. తెలుగు రాని పరభాషా హీరోయిన్లనే ఎంకరేజ్ చెయ్యాలని డిసైడ్ అయ్యాము” అంటూ కామెంట్స్ చేశారు. దీంతో ఎస్.కె.ఎన్ పరోక్షంగా ‘బేబి’ (Baby) హీరోయిన్ వైష్ణవి చైతన్యను (Vaishnavi Chaitanya) టార్గెట్ చేసి ఈ వ్యాఖ్యలు చేసినట్టు అంతా అభిప్రాయపడ్డారు.
వైష్ణవిని ఇష్టపడే వారు ఎస్.కె.ఎన్ ను ట్రోల్ చేయడం కూడా జరిగింది. ఓ డబ్బింగ్ సినిమా వేడుకలో తెలుగు హీరోయిన్ల గురించి ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటి? అంటూ సామాన్యులు కూడా ఎస్.కె.ఎన్ తీరును తప్పుబట్టారు. దీంతో ఎస్.కె.ఎన్ ఒక వీడియో ద్వారా ఆ కామెంట్స్ కి క్లారిటీ ఇవ్వడం జరిగింది. “నేను వైష్ణవి చైతన్యని ఉద్దేశించి నేను ఆ కామెంట్స్ చేయలేదు. ఇంకా చాలా మంది తెలుగు అమ్మాయిలని పరిచయం చేశాను.
ఏదో సరదాగా ఆ ఈవెంట్లో పలికిన మాటలను అంతా సీరియస్ గా తీసుకున్నారు. జోక్ ని జోక్ లా తీసుకోండి” అంటూ ఎస్.కె.ఎన్ చెప్పుకొచ్చారు. అక్కడితో దీనికి ఫుల్ స్టాప్ పడినట్టే అని అంతా భావించి ఆడియన్స్ కూడా ఈ టాపిక్ ను లైట్ తీసుకున్నారు. అయితే ఈరోజు ‘జాక్’ (Jack) సాంగ్ లాంచ్ వేడుకలో వైష్ణవి చైతన్య మీడియాతో ఇంటరాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఈ క్రమంలో కొంతమంది రిపోర్టర్లు ..
ఎస్.కె.ఎన్ కామెంట్స్ ని గుర్తు చేస్తూ వైష్ణవిని టార్గెట్ చేశారు. ‘ఎస్.కె.ఎన్ తో మీకు ఉన్న ప్రాబ్లమ్ ఏంటి?’ అంటూ డైరెక్ట్ ఎటాక్ చేశారు. అందుకు వైష్ణవి చాలా కూల్ గా ‘అసలు ఆయన ఎవరిని అన్నారో నాకు తెలీదు. తర్వాత ఆయన ‘నా గురించి ఏమీ అనలేదు’ అని వీడియో కూడా చేసి పెట్టారు? దానికి ఆన్సర్ ఇచ్చినట్టే కదా?’ అంటూ కూల్ గా సమాధానం ఇచ్చింది.
అయినా సరే మరో రిపోర్టర్ ఆ ప్రశ్నని సాగదీసే ప్రయత్నం చేశాడు. దానికి కూడా వైష్ణవి.. “ఆ వీడియోలో నన్ను ఏమీ అనలేదు ఆయన క్లియర్ గా చెప్పారు కదా. మరి ఆయనతో నాకు ప్రాబ్లమ్ ఏముంటుంది?” అంటూ మళ్ళీ కూల్ గా జవాబిచ్చింది. దీంతో దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
ఎస్.కె.ఎన్ అన్నది నన్ను కాదు కదండీ#VaishnaviChaitanya #SKN #SiddhuJonnalagadda #JACK pic.twitter.com/WJ0MwxaFyv
— Filmy Focus (@FilmyFocus) March 20, 2025