వైష్ణవి చైతన్య అందరికీ సుపరిచితమే. పలు షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించింది. అటు తర్వాత ఈమెకు సినిమాల్లో అవకాశాలు లభించాయి. రవితేజ నటించిన ‘టచ్ చేసి చూడు’ ఈమెకి మొదటి సినిమా. అటు తర్వాత ‘గీత గోవిందం’ ‘అల వైకుంఠపురములో’ ‘టక్ జగదీశ్’ ‘వరుడు కావలెను’ వంటి సినిమాల్లో నటించింది. అటు తర్వాత ఈమెకు ‘బేబీ’ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాకి హార్ట్ అండ్ సోల్ ఈమెనే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆమె నటనతో యూత్ అండ్ ఫ్యామిలీస్ ని కట్టిపడేసింది.
Vaishnavi Chaitanya
ఆ సినిమా వంద కోట్ల క్లబ్లో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘జాక్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ఆమె ముస్లిం యువతిగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ‘జాక్’ లో కూడా వైష్ణవి రోల్ హైలెట్ గా నిలుస్తుంది అని ఇన్సైడ్ టాక్. కాంబినేషన్ కూడా బాగా సెట్ అయ్యింది కాబట్టి.. దీనిపై ట్రేడ్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
మరోపక్క వైష్ణవికి పక్క భాషల నుండి కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి అనేది తాజా సమాచారం. అవును ఈమెకు తమిళ, కన్నడ సినీ పరిశ్రమల నుండి కూడా పిలుపొచ్చిందట. ఈ మధ్యనే వైష్ణవి 2 తమిళ సినిమాలకి ఫైనల్ అయ్యిందట. అంతేకాదు కన్నడ సినీ పరిశ్రమ నుండి కూడా ఆమెకు ఒక పెద్ద సినిమాలో ఆఫర్ వచ్చిందట. ‘బేబీ’ తో క్రేజ్ వచ్చింది కదా అని వైష్ణవి వరుస ఆఫర్లకి ఓకే చెప్పేయడం లేదు. తన పాత్రకి వెయిట్ ఉన్న సబ్జెక్టులే ఎంచుకుంటుంది.
సో ఆమె ఓకే చేసిన పక్క భాషల సినిమాలు కూడా అలాగే ఉంటాయేమో. ఏదేమైనా ఈ బ్యూటీ సైలెంట్ గా పాన్ ఇండియా ఇమేజ్ కొట్టేస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది అనే సంగతి తెలిసిందే. ఈమె ఫొటోలకి నెటిజన్లు లైకులు వర్షం కురిపిస్తూ ఉంటారు. ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.