వెంకటేష్ (Venkatesh), దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్లో ‘ఎఫ్ 2’ వంటి బ్లాక్ బస్టర్ హిట్, ‘ఎఫ్ 3’ వంటి డీసెంట్ హిట్ తర్వాత రూపొందిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam). దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. భీమ్స్ సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించుకున్నాయి. ముఖ్యంగా రమణ గోగుల పాడిన.. ‘గోదారి గట్టుమీద’ అనే పాట చార్ట్ బస్టర్ అయ్యింది. దీంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమాకు రూ.40 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.41 కోట్ల షేర్ ను రాబట్టాలి. టాక్ కనుక పాజిటివ్ గా వస్తే.. బ్రేక్ ఈవెన్ సాధించడం ఈజీనే అని చెప్పాలి.