‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ నుండీ 3 ఏళ్ళ తరువాత వచ్చిన చిత్రం ‘వకీల్ సాబ్’. ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే హిట్ టాక్ ను సంపాదించుకుంది. ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. రాజకీయ కుట్రలు జరిగినప్పటికీ.. థియేటర్లు తెరుచుకున్న తరువాత ఈ స్థాయిలో వసూళ్లు మరే సినిమా కూడా రాబట్టలేకపోయింది.అయితే మొదటి వారం తరువాత ఈ చిత్రం కలెక్షన్లు బాగా తగ్గిపోయాయి. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగా ‘వకీల్ సాబ్’ జోరు కొనసాగలేదు.
ఇక వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్లను ఓసారి గమనిస్తే :
నైజాం
24.49 cr
సీడెడ్
12.92 cr
ఉత్తరాంధ్ర
11.86 cr
ఈస్ట్
6.24 cr
వెస్ట్
7.27 cr
గుంటూరు
7.11 cr
కృష్ణా
4.94 cr
నెల్లూరు
3.35 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
78.18 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
3.58 cr
ఓవర్సీస్
3.85 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
85.61 cr
‘వకీల్ సాబ్’ చిత్రానికి 89.85కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 90.5కోట్ల వరకూ షేర్ ను రాబట్టాలి.అయితే ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం 85.61 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టగలిగింది. ఫైనల్ గా 4.89 కోట్ల స్వల్ప నష్టం వాటిల్లింది. వేరే టైములో కనుక విడుదలయ్యి ఉంటే.. ఈ చిత్రం ఫలితం మరోలా ఉండేది అని చెప్పాలి. కానీ ఇప్పుడు ఎబౌవ్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.