మున్నా సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వంశీ పైడిపల్లి మొదటి సక్సెస్ చూడడానికి సమయం చాలానే పట్టింది. బృందావనం, ఎవడు వంటి సినిమాలతో కమర్షియల్ హిట్ అందుకున్నప్పటికి ఈ దర్శకుడి స్థాయి ఇంకా పెరగలేదు. ప్రతీ సారి పెద్ద హీరోలనే పడుతున్నాడు గాని మేకింగ్ రొటీన్ గానే ఉంటుందనే కామెంట్స్ ఎక్కువగా అందుకుంటున్నాడు. మహర్షి సినిమాతో భారీ హైప్ క్రియేట్ చేయగలిగాడు గాని అనుకున్నంత రేంజ్ లో సరైన వసూళ్లను అందుకోలేకపోయాడు.
ఇక ఆ సినిమా తరువాత మహేష్ మరో సినిమా చేయాలని అనుకున్నాడు. అయితే సరైన కథ సెట్టవ్వకపోవడం వలన మళ్ళీ డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. ఇక వంశీ పైడిపల్లి మహర్షి సినిమా వచ్చి మూడేళ్లవుతున్నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటనేది ఇంకా తేలలేదు. మొదట అల్లు అర్జున్ అన్నారు ఆ తరువాత పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక మెగాస్టార్ కు కూడా కథ వినిపించినట్లు టాక్ వచ్చింది. చివరికి దిల్ రాజు సహాయంతో కోలీవుడ్ స్టార్ విజయ్ తో పాన్ ఇండియా ఛాన్స్ పట్టేసినట్లు కథనాలు వచ్చాయి.
ఇక ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ తోనే సినిమా ఉంటుందని కొత్త రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. కానీ ఈ విషయంలో కూడా ఎలాంటి క్లారిటీ లేదు. కథ అయితే వినిపించడాని టాక్ గట్టిగానే వస్తోంది. మరి బన్నీ అయినా వంశీ కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి.