కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వరిసు’. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ మూవీని సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు. రష్మిక మందన హీరోయిన్ గా నటించగా జయసుధ, శ్రీకాంత్, కిక్ శామ్.. వంటి వారు కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ మూవీ తమిళ్ లో రిలీజ్ అయ్యింది. అక్కడ మంచి టాక్ తెచ్చుకోవడంతో తెలుగులో కూడా అంచనాలు పెరిగాయి.
తెలుగు వెర్షన్ ‘వారసుడు’ పేరుతో జనవరి 14న రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ కూడా సోసో గా నమోదయ్యాయి.కానీ స్టడీగానే కలెక్ట్ చేసింది అని చెప్పాలి. రెండో వీకెండ్ ను ఈ మూవీ పెద్దగా క్యాష్ చేసుకోలేదు. అలా అని కలెక్ట్ చేసింది తక్కువని కూడా చెప్పలేం. ఒకసారి 9 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
5.09 cr
సీడెడ్
2.18 cr
ఉత్తరాంధ్ర
2.20 cr
ఈస్ట్
1.04 cr
వెస్ట్
0.80 cr
గుంటూరు
0.95 cr
కృష్ణా
0.94 cr
నెల్లూరు
0.64 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
13.84 cr
‘వారసుడు’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.13.93 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.14.2 కోట్ల షేర్ ను రాబట్టాలి.9 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.13.84 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ ఇంకా రూ.0.36 కోట్ల షేర్ ను రాబట్టాలి. మరో 4,5 రోజులు క్యాష్ చేసుకుంటే బ్రేక్ ఈవెన్ ఛాన్స్ లు ఉంటాయి.