Varasudu Collections: తెలుగులో హిట్ గా నిలిచిన ‘వారసుడు’..!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వరిసు’. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ మూవీని సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు. రష్మిక మందన హీరోయిన్ గా నటించగా జయసుధ, శ్రీకాంత్, కిక్ శామ్.. వంటి వారు కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ మూవీ తమిళ్ లో రిలీజ్ అయ్యింది. అక్కడ మంచి టాక్ తెచ్చుకోవడంతో తెలుగులో కూడా అంచనాలు పెరిగాయి.

తెలుగు వెర్షన్ ‘వారసుడు’ పేరుతో జనవరి 14న రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ కూడా సోసో గా నమోదయ్యాయి.కానీ స్టడీగానే కలెక్ట్ చేసింది ఫైనల్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 5.51 cr
సీడెడ్ 2.38 cr
ఉత్తరాంధ్ర 2.41 cr
ఈస్ట్ 1.15 cr
వెస్ట్ 0.84 cr
గుంటూరు 1.02 cr
కృష్ణా 1.00 cr
నెల్లూరు 0.68 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 14.99 cr

‘వారసుడు’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.13.93 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.14.2 కోట్ల షేర్ ను రాబట్టాలి.2 వారాలకు బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఫుల్ రన్ పూర్తయ్యేసరికి రూ.14.99 కోట్ల షేర్ ను రాబట్టింది.

ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసి రూ.0.79 కోట్ల ప్రాఫిట్ ను అందించి హిట్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ మూవీ. విజయ్ తెలుగు మార్కెట్ స్ట్రాంగ్ గా ఉందని ఈ మూవీ ద్వారా మరోసారి ప్రూవ్ అయ్యింది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus