ప్రముఖ కోలీవుడ్ నటులలో ఒకరైన విజయ్ నటించిన వారసుడు సినిమా 2023 సంవత్సరం సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ప్రధానంగా తమిళ మార్కెట్ పై దృష్టి పెట్టడంతో తెలుగులో పెద్ద సినిమాలు రిలీజవుతున్నా ఈ సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు కళ్లు చెదిరే రేటుకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. అక్టోబర్ నెల నెలాఖరు నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుందని సమాచారం అందుతోంది.
వారసుడు నాన్ థియేట్రికల్ హక్కులు ఏకంగా 120 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేయగా సన్ నెట్వర్క్ శాటిలైట్ హక్కులను కొనుగోలు చేసింది. ఈ సినిమా ఆడియో హక్కులు 10 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. డిజిటల్ హక్కులు 60 కోట్ల రూపాయలకు, శాటిలైట్ హక్కులు 50 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని బోగట్టా. విజయ్ కు జోడీగా ఈ సినిమాలో రష్మిక మందన్న నటిస్తున్నారు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా అతడు, బృందావనం తరహా స్టోరీ లైన్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. వారసుడు సినిమాతో విజయ్ ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ చేరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వంశీ పైడిపల్లి టాలెంటెడ్ డైరెక్టర్ కావడంతో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
వారసుడు సినిమా సక్సెస్ సాధిస్తే తమిళ హీరో తెలుగు డైరెక్టర్ కాంబో దిశగా మరిన్ని సినిమాలు తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంది. పలువురు తమిళ డైరెక్టర్లు సైతం టాలీవుడ్ హీరోలతో సినిమాలను తెరకెక్కించాలని ఆశ పడుతున్నారు.