‘రెమో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్. అతని నుండీ వచ్చిన లేటెస్ట్ మూవీ ‘వరుణ్ డాక్టర్’. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘బీస్ట్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన చిత్రమిది. కె.జె.ఆర్. స్టూడియోస్ అధినేత కోటపాడి జె. రాజేష్… ‘గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్’, ‘ఎస్.కె. ప్రొడక్షన్స్’ తో కలిసి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 9న ఏక కాలంలో విడుదలైంది. మొదట ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ సూపర్ హిట్ టాక్ రావడంతో రెండో రోజు నుండీ పుంజుకుంది. దసరాకి కొత్త సినిమాలు వచ్చినా దీని జోరు తగ్గలేదు. ఇంకా డీసెంట్ కలెక్షన్స్ రాబడుతూనే ఉంది.
ఈ చిత్రం 2 వారాల కలెక్షన్లను గమనిస్తే :
నైజాం | 0.61 cr |
సీడెడ్ | 0.34 cr |
ఉత్తరాంధ్ర | 0.32 cr |
ఈస్ట్ | 0.21 cr |
వెస్ట్ | 0.15 cr |
గుంటూరు | 0.23 cr |
కృష్ణా | 0.22 cr |
నెల్లూరు | 0.13 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 2.21 cr |
‘వరుణ్ డాక్టర్’ చిత్రానికి తెలుగులో రూ.1.18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.దాంతో బ్రేక్ ఈవెన్ కి రూ.1.25 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఆ టార్గెట్ ను మొదటి వారమే ఫినిష్ చేసిన ఈ చిత్రం రెండో వారం కూడా డీసెంట్ కలెక్షన్లను రాబట్టింది. రెండు వారాలు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.2.21 కోట్ల షేర్ ను రాబట్టింది.బయ్యర్లకు ఇప్పటి వరకు రూ.0.96 కోట్ల వరకు లాభాలు దక్కినట్టు అయ్యింది.
Most Recommended Video
సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్ టాప్ భామల రెమ్యూనరేషన్ ఎంతంటే?