Varun Tej: నేనే ముందుగా లావణ్యకు ప్రపోజ్ చేశాను!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే గాండీవదారి అర్జున సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు వరుణ్ హాజరు అవ్వడమే కాకుండా తన వ్యక్తిగత విషయాల గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వరుణ్ తేజ్ లావణ్యతో తన ప్రేమ గురించి పలు విషయాలను వెల్లడించారు.

నటి లావణ్యతో వరుణ్ తేజ్ (Varun Tej) ప్రేమలో ఉంటూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికి వీరిద్దరి నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ తన ప్రేమ గురించి మాట్లాడుతూ… తనకు ఉన్నటువంటి బెస్ట్ ఫ్రెండ్స్ లో లావణ్య త్రిపాఠి ఒకరు మేమిద్దరం మంచి స్నేహితులుగానే ఉన్నాము. అయితే ఇద్దరు ప్రేమలో పడి సుమారు ఐదు సంవత్సరాలు అవుతుందని ఈయన తెలియజేశారు.

మా ఇద్దరి అభిప్రాయాలు అభిరుచులు ఆలోచనలు ఒకటే కావడంతో ఇద్దరం కలిసి జీవితంలో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాము. ఇక తానే ముందుగా లావణ్యకు ప్రపోజ్ చేశానని వరుణ్ తేజ్ తెలిపారు. ఇక మా ప్రేమ విషయాన్ని ఇంట్లో వారికి చెప్పడంతో ఇరువురి కుటుంబ సభ్యులు కూడా మా నిర్ణయాన్ని గౌరవించారని ఈయన తెలియజేశారు.లావణ్య త్రిపాటికి తన గురించి బాగా తెలుసు నాకు ఎప్పుడు ఏమి అవసరమో అన్ని విషయాలు తనకు తెలుసని తాను చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుందని వరుణ్ తెలిపారు.

ఇక మా ప్రేమ విషయాన్ని ఇన్ని రోజులు బయట పెట్టకపోవడానికి కారణం మరేమీ లేదు ఇది మా పర్సనల్ విషయం పర్సనల్ విషయాలు ఎప్పుడు బయటకు చెప్పుకోవడానికి తనకు ఇష్టం ఉండదని అందుకే ఇన్ని రోజులు ప్రేమ విషయాన్ని దాచి పెట్టామంటూ ఈయన తెలియజేశారు.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus