తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబం నుంచి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు వరుణ్ తేజ్ ఒకరు. ఈయన ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. త్వరలోనే గాండీవదారి అర్జును అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక వరుణ్ తేజ్ సినిమాలను కనుక గమనిస్తే ఈయన సినిమాలు కాస్త విభిన్న రీతిలో ఉంటాయి. ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా వరుణ్ తేజ్ ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వరుణ్ (Varun Tej) సినిమాలు ఎంపిక విషయంలో తన కొన్ని సలహాలు సూచనలు చేశారు అంటూ తెలియజేశారు. మరి చరణ్ వరుణ్ కి ఎలాంటి సలహాలు ఇచ్చారనే విషయానికి వస్తే… తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. నా ఏడవ సినిమా తర్వాత రామ్ చరణ్ అన్నయ్య తనకు ఫోన్ చేసి యూనిక్ కథలను ఎంపిక చేసుకోమని నాకు సలహా ఇచ్చారని తెలియజేశారు.
నీ చుట్టూ ఉన్నవాళ్లు మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని సేఫ్ సైడ్ ఉండే సినిమాలను ఎంపిక చేసుకోమని సలహాలు ఇస్తూ ఉంటారు. అయితే అలాంటి వారి మాటలను ఏమాత్రం పట్టించుకోవద్దని చరణ్ అన్న తెలిపారని వెల్లడించారు. నీకంటూ ఒక మంచి గుర్తింపు రావాలి అంటే కొత్త తరహా కథలను ఎంపిక చేసుకోవాలని అప్పుడే మంచి గుర్తింపు లభిస్తుందని తనకు సలహాలు ఇచ్చారని వరుణ్ తెలియజేశారు.
అలాగే కథలను ఎంపిక చేసుకునే సమయంలో కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని కథలను ఎంపిక చేసుకోవాలి అంటూ ఈ సందర్భంగా చరణ్ తనకు సలహాలు ఇచ్చారు అంటూ వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.