Bigg Boss Telugu 6: నిజంగా రాజ్ చెప్పిన రీజన్ కే హర్ట్ అయ్యిందా..? అసలేం జరిగిందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో ఏడోవారం హౌస్ మేట్స్ లెక్కలు మారుతున్నాయి. జెన్యూన్ గా ఆడుతున్నామనే ఉద్దేశ్యంతోనే హౌస్ మేట్స్ రీజన్స్ చెప్తున్నారు. ముఖ్యంగా బాటిల్ ఆఫ్ సర్వైవర్ టాస్క్ లో హౌస్ మేట్స్ రెచ్చిపోయి మరీ ప్రదర్శన ఇచ్చారు. బిగ్ బాస్ కి చేసిన వాగ్దానం ప్రకారం, పూర్తిస్థాయి ఆటని ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా లేకుండా ఎక్కువ పోట్లాడుతూ, తోసుకుంటూ మరీ టాస్క్ ఆడారు. శ్రీసత్య టీమ్ లీడర్ గా పూలని, బొమ్మలని కాపాడుతూ మాటలతోనే ఎక్కువ గేమ్ ఆడింది.

ముఖ్యంగా రేవంత్ ని టార్గెట్ చేసింది. ఇక ఈ టాస్క్ అయిపోగానే బ్లూటీమ్ శ్రీసత్య టీమ్, రెడ్ టీమ్ ఇనయ టీమ్ తో ఓడిపోయింది. రెండు రౌండ్లో కూడా ఇనయ టీమ్ గెలిచింది. దీంతో శ్రీసత్య టీమ్ సభ్యుల నుంచీ ఒకరు వచ్చేవారం నేరుగా నామినేట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికోసం ముందుగానే హౌస్ మేట్స్ లెక్కలు వేసుకున్నారు. చిట్టీలు వేసుకుని నామినేషన్స్ తీస్కుందామని అనుకున్నారు. ఈ చిట్టీలని ఫైమా వచ్చి మరీ తీసింది. ఇందులో శ్రీసత్య పేరు వచ్చింది. సరే, అని నేను వచ్చేవారం నామినేషన్స్ తీస్కుంటానని చెప్పింది.

దీంతో ప్రశాంతంగా అందరూ నిద్రపోయారు. కానీ, ఇక్కడ్నుంచే అసలు గేమ్ స్టార్ట్ చేసింది శ్రీసత్య. పొద్దునే ఏమనుకుందో ఏమో కానీ, నామినేషన్స్ చిట్టీల ప్రకారం కాకుండా పెర్ఫామన్స్ ప్రకారం చూద్దామని, ఈవారం ఆటని బట్టీ ఓటింగ్ వేసుకుందామని చెప్పింది. దీంతో శ్రీసత్యకి, వాసంతీకి ఓట్లు పడ్డాయి. అలాగే గీతుకి కూడా ఓట్లు వేశారు బ్లూటీమ్ సభ్యులు. ఇక్కడే వాసంతీకి డిసైడెడ్ ఓటు వేయడానికి వచ్చాడు రాజ్. రాజ్ చెప్పిన రీజన్ కి హర్ట్ అయ్యింది వాసంతీ.

ఓవర్ ఆల్ గా ఈవీక్ పెర్ఫామన్స్ చూసి రాజ్ ఓటు వేస్తుంటే, కేవలం బ్యాటిల్ ఆఫ్ సర్వైవర్ టాస్క్ లో మాత్రమే చూడమని వాసంతీ ఆర్గ్యూ చేసింది. దీంతో ఇద్దరి మద్యలో మాటల యుద్ధం అయ్యింది. కేవలం రాజ్ చెప్పిన రీజన్ కి డీప్ గా హర్ట్ అయ్యింది వాసంతీ. అంతేకాదు, డిస్కషన్స్ కి ముందు మాములుగా తను నామినేషన్స్ తీస్కుంటానని చెప్పిన పాయింట్ ని రాజ్ చెప్పడం పట్ల అసహనం వ్యక్తం చేసింది. నామినేషన్ తీస్కుంటాను అని చెప్పినా ప్రాబ్లమే, నామినేషన్స్ వద్దన్నా ప్రాబ్లమే, నేను నామినేషన్స్ కి భయపడుతున్నానంటారు.

గేమ్ ఆడినా ప్రాబ్లమే, ఆడకపోయినా ప్రాబ్లమే అసలు ఆడకుండా ఉండాల్సిందంటూ రెచ్చిపోయింది. ఆ తర్వాత హౌస్ లో ఈవారం డిజాస్టర్ గేమ్ ఎవరు ఆడారనే ఓటింగ్ పెట్టినపుడు కూడా వాసంతీకి ఎక్కువగా ఓట్లు పడ్డాయి దీంతో తన ఫ్రస్టేషన్ ఎక్కువ అయ్యింది. చివరకి సూర్య కూడా ఏదో ఒక రీజన్ చెప్పి వాసంతీకే ఓటు వేశాడు. ఇక్కడ సూర్యకి ఇనయ డిజాస్టర్ అని ఓటు వేయడం హైలెట్ అని చెప్పాలి. అత్యధికంగా ఓట్లు వచ్చిన కారణంగా వాసంతీ జైల్ కి వెళ్లింది. మొత్తానికి ఈవారం ఫిజికల్ టాస్క్ ఆడినా కూడా వరెస్ట్ పెర్ఫామర్ అయ్యింది వాసంతీ. అదీ మేటర్.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus