విక్రమ్ (Vikram) మొదటి నుండి విలక్షణమైన సినిమాలే చేస్తున్నాడు. గతేడాది ‘తంగలాన్’ తో (Thangalaan) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇతను.. ఆ సినిమాతో పర్వాలేదు అనిపించే ఫలితాన్ని బాక్సాఫీస్ వద్ద అందుకున్నాడు. ఇక మరో రెండు రోజుల్లో ‘వీర ధీర శూర’గా (Veera Dheera Sooran) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘సేతుపతి’ ‘చిన్నా’ వంటి వైవిధ్యమైన సినిమాలు తీసిన ఎస్.యు.అరుణ్ కుమార్ (S. U. Arun Kumar) దీనికి దర్శకుడు. వాస్తవానికి 2 పార్టులుగా రూపొందిన సినిమా ఇది. ఈ ‘వీర ధీర శూర’ అనేది రెండో భాగం. ముఖ్యంగా మొదటి భాగానికి ప్రీక్వెల్ గా రూపొందింది.
అయితే దీన్ని ముందుగా రిలీజ్ చేస్తున్నారు. మార్చి 27న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఎస్.జె.సూర్య (S. J. Suryah) వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాని తెలుగులో ‘ఎన్.వి.ఆర్ సినిమాస్’ బ్యానర్ పై ఎన్వీ ప్రసాద్ రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ కొంతమంది ఆయన స్పెషల్ షో వేయడం జరిగింది. సినిమా చూసిన వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. వారి టాక్ ప్రకారం.. కాళి అనే సూపర్ మార్కెట్ నడుపుకునే వ్యక్తి..
ఒక పెద్ద క్రైమ్లో ఇరుక్కుంటాడు. అతను ఇరుక్కున్నాడా? లేక ఇరికించారా? అందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి అనేది మిగిలిన కథ అని తెలుస్తుంది. ఇది కంప్లీట్ గా ఒక రాత్రి పూట జరిగే కథ అని అంటున్నారు. పూర్తిగా యాక్షన్ ఎలిమెంట్స్ తో నిండి ఉందట. కాళిగా విక్రమ్ నటన హైలెట్ గా ఉంటుందని కూడా చెబుతున్నారు. క్లైమాక్స్ లో సీక్వెల్ కి లీడ్ కూడా ఇచ్చినట్టు ఇన్సైడ్ టాక్.