‘తంగలాన్’ తర్వాత విక్రమ్ (Vikram) నుండి ‘వీర ధీర శూర’ (Veera Dheera Soora) అనే సినిమా రూపొందింది. ‘సేతుపతి’ (Vijay Sethupathi) ‘చిన్నా’ వంటి సినిమాలు తీసిన ఎస్.యు.అరుణ్ కుమార్ (S. U. Arun Kumar) దర్శకుడు. మార్చి 27న ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ఆర్థిక లావాదేవీల కారణంగా ‘వీర ధీర శూర’ రిలీజ్ కి హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. అయితే నిర్మాతలు ఆ ఇష్యూని సార్ట్ అవుట్ చేసుకుని రిలీజ్ కి క్లియరెన్సులు కూడా తెచ్చుకున్నారు. మరోపక్క రెండు పార్టులుగా రూపొందిన ఈ సినిమాని.. రెండో పార్ట్ ముందుగా రిలీజ్ చేస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి.
ఎస్.జె.సూర్య (S. J. Suryah) ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే 30 ఇయర్స్ పృథ్వీ (Prudhvi Raj) కూడా విలన్ రోల్ చేస్తుండటం మరో ఆసక్తికర విషయం. తెలుగులో ఈ సినిమాని ఎన్.వి.ఆర్ సినిమాస్ బ్యానర్ పై ఎన్వీ ప్రసాద్ రిలీజ్ చేస్తున్నారు. ఒకసారి బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్ ను గమనిస్తే :
నైజాం | 1.20 కోట్లు |
సీడెడ్ | 0.40 కోట్లు |
ఆంధ్ర(టోటల్) | 1.80 కోట్లు |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 3.40 కోట్లు |
‘వీర ధీర శూర’ (Veera Dheera Soora) చిత్రానికి రూ.3.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.6 కోట్ల షేర్ ను రాబట్టాలి. సినిమాకు పాజిటివ్ టాక్ కనుక వస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదు అంటే కష్టం. ఎందుకంటే పోటీగా ‘ఎల్ 2 : ఎంపురాన్’ (L2: Empuraan) ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) ‘రాబిన్ హుడ్’ (Robinhood) వంటి ఇంకో 3 సినిమాలు ఉన్నాయి.