2019 లో మలయాళంలో రూపొందిన ‘లూసిఫర్’ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. తర్వాత తెలుగులో కూడా డబ్ చేశారు. ఇక్కడ కూడా మంచి టాక్ వచ్చింది కానీ… బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు.తర్వాత అదే కథని చిరంజీవి (Chiranjeevi) ‘గాడ్ ఫాదర్’ గా (Godfather) రీమేక్ చేయించారు. అది కూడా బాగానే ఆడింది. అయితే ‘లూసిఫర్’ సీక్వెల్ గా రూపొందిన ‘ఎల్ 2 – ఎంపురాన్’ ను (L2: Empuraan) మాత్రం పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు.
దీనికి కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకుడు. తెలుగులో ఈ సినిమాని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. దీంతో బిజినెస్ బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం | 2.20 కోట్లు |
సీడెడ్ | 0.60 కోట్లు |
ఆంధ్ర(టోటల్) | 2.00 కోట్లు |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 4.80 కోట్లు |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ (తెలుగు వెర్షన్) |
0.50 కోట్లు |
వరల్డ్ వైడ్ (టోటల్) | 5.30 కోట్లు(షేర్) |
‘ఎల్ 2 – ఎంపురాన్’ (L2 Empuraan) సినిమాకి రూ.5.3 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5.6 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ‘లూసిఫర్’ హిట్ అవ్వడంతో .. ‘ఎల్ 2 – ఎంపురాన్’ పై మొదటి నుండి మంచి క్రేజ్ ఏర్పడింది. పాజిటివ్ టాక్ కనుక వస్తే మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది.