తెలుగులో రీమేక్ సినిమాలంటే గుర్తొచ్చే హీరోల్లో వెంకటేశ్ ఒకరు. ఒక విధంగా చెప్పాలంటే ఇతర భాషల్లో ఓ సినిమా హిట్ అయ్యింది అనగానే… వెంకటేశ్ తెలుగులో రీమేక్ చేస్తారా అంటూ చర్చలు మొదలవుతాయి. తాజాగా ఆయన రీమేక్ చేస్తున్న చిత్రం ‘నారప్ప’. తమిళంలో ఘనవిజయం సాధించి హీరో ధనుష్‌కు జాతీయ పురస్కారం కూడా తెచ్చి పెట్టింది. అలాంటి సినిమా తెలుగులో చేస్తున్న వెంకీకి రీమేక్‌లు ప్లస్సా.. మైనస్సా? ఈ చర్చకు మనం సమాధానం చెప్పడం ఎందుకు అని… వెంకటేశ్‌నే అడిగాం.
దానికి ఆయన నాకు రీమేకులు చేయడం అంటే సరదా కాదు. సవాళ్లు ఉంటాయి. ఆ హీరో బాడీ లాంగ్వేజిని అర్థం చేసుకుని… నా బాడీ లాంగ్వేజీకి మాచ్ చేయడమంటే పెద్ద రిస్క్. రీమేక్ కథలు ఎంచుకున్నప్పుడు డౌట్లుంటాయి. సినిమా మీద అంచనాలూ పెరుగుతాయి. ఇలా అన్నింటిని బాలెన్స్ చేసుకొని సినిమా చేయాలి అని చెప్పారు వెంకీ. అంతేకాదు వెంకీ ఎప్పుడూ రీమేక్‌లు చేయాలని అనుకోలేదట. అవే ఆయన దగ్గరకు వచ్చేవట.
ఇక ‘నారప్ప’ కోసం వెంకీ 50 రోజులపాటు సీనియర్ హీరో పాత్ర గెటప్‌లోనే ఉన్నారట. దాంతో ఆ పాత్రకు బాగా దగ్గరయ్యారట. ఆ పాత్ర చేసినప్పుడు తెలియని ఎనర్జీ వచ్చేసేదట. మోనిటర్‌లో ఆ సీన్స్ చూసుకున్నప్పుడు భలే ఫీలింగ్ కలిగేదట వెంకీకి. సినిమా చూసినప్పుడు ప్రేక్షకుల ఫీలింగ్ ఏంటో చూడాలి మరి.