Venkatesh: వెంకీ ‘రెమ్యునరేషన్’ ఇష్యూ.. సుస్మిత కొణిదెల షాకింగ్ క్లారిటీ! – Filmy Focus
- January 22, 2026 / 05:44 PM ISTByFilmy Focus Writer
సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలో విక్టరీ వెంకటేష్ చేసిన ‘వెంకీ గౌడ’ మ్యాజిక్ అంతా ఇంతా కాదు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేసిన హడావుడికి థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. అయితే ఇంత పెద్ద స్టార్ ఒక స్పెషల్ రోల్ చేశారంటే పారితోషికం ఏ రేంజ్‌లో ఉండి ఉంటుందనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగింది. ఈ విషయంపై నిర్మాత సుస్మిత కొణిదెల ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.
Venkatesh
సాధారణంగా ఇలాంటి క్రేజీ మల్టీస్టారర్ మూమెంట్స్ కోసం స్టార్ హీరోలు భారీగా డిమాండ్ చేస్తారని అందరూ అనుకుంటారు. కానీ వెంకటేష్ విషయంలో సీన్ కంప్లీట్ గా రివర్స్ అని సుస్మిత మాటలను బట్టి అర్థమవుతోంది. ఆయన పారితోషికం గురించి డైరెక్ట్ గా అంకెలు చెప్పనప్పటికీ, వెంకీ గారు చూపించిన ‘పెద్ద మనసు’ గురించి ఆమె గొప్పగా చెప్పుకొచ్చారు. కేవలం చిరంజీవి గారి మీద ఉన్న గౌరవంతోనే ఆయన ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారని క్లారిటీ ఇచ్చారు.
నిజానికి అనిల్ రావిపూడి ఈ క్యారెక్టర్‌ను వెంకటేష్ గారికి చెప్పినప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. రెమ్యునరేషన్ కంటే కూడా సినిమాలో ఆ పాత్ర ఇచ్చే ఇంపాక్ట్, మెగాస్టార్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడంపైనే ఆయన ఇంట్రెస్ట్ చూపించారట. సుస్మిత మాట్లాడుతూ.. “వెంకటేష్ గారు మా ఫ్యామిలీ మెంబర్, ఆయన అడిగింది మేము ఇచ్చాం కానీ ఈ సినిమాకు ఆయన ఇచ్చిన వాల్యూ మాత్రం అమూల్యమైనది” అని పేర్కొన్నారు.
డబ్బు కంటే ఫ్రెండ్‌షిప్ కే ప్రాధాన్యత ఇచ్చే వెంకటేష్ గారు, ఈ సినిమా సక్సెస్‌లో భాగం కావడమే తమకు పెద్ద గిఫ్ట్ అని సుస్మిత వెల్లడించారు. ‘వెంకీ గౌడ’ పాత్ర డిజైన్ చేసిన విధానం, దానికి వెంకటేష్ గారు జోడించిన ఎనర్జీ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాయని మేకర్స్ ఫీలవుతున్నారు. రెమ్యునరేషన్ విషయంలో చాలా తక్కువ పారితోషికానికే వర్క్ చేశారనే వార్తలకు సుస్మిత మాటలు బలాన్ని చేకూర్చాయి.
















