దగ్గుబాటి రానాకి “నేనే రాజు నేనే మంత్రి” సినిమా హీరోగా రీ ఎంట్రీ మూవీ అనే చెప్పాలి. ఎందుకంటే లీడర్ తో హీరోగా అడుగుపెట్టినా మంచి విజయాన్ని అందుకోలేకపోయారు. బాహుబలి చిత్రంతో మంచి నటుడిగా నిరూపించుకున్నారు. అంతేగాని హీరోగా కాదు. బాహుబలి చిత్రాల మధ్యలో చేసిన ఘాజి ప్రయోగాత్మక చిత్రమే. కమర్షియల్ సినిమా కాదు. సో దాన్ని కూడా లెక్కలోకి తీసుకోలేము. అందుకే తేజ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న “నేనే రాజు నేనే మంత్రి” సినిమాపై రానాతో పాటు, అతని తండ్రి సురేష్ బాబు దృష్టి పెట్టారు. అంతేకాదు అబ్బాయి హీరోగా నిలబడాలని బాబాయ్ విక్టరీ వెంకటేష్ కూడా శ్రమించినట్లు తెలిసింది.
ఈ చిత్రం ఎడిటింగ్ రూమ్ లో మొదటి నుంచి చివరి వరకు కూర్చున్నారని, ఎక్కడా ల్యాగ్ లేకుండా షార్ప్ గా ఎడిటింగ్ చేయించినట్లు సమాచారం. అందుకే అవుట్ ఫుట్ సూపర్ గా వచ్చినట్లు టాక్. ఫస్ట్ కాపీ చూసుకున్న తర్వాత చిత్ర యూనిట్ సభ్యులందరితో తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకం కలిగిందట. ఈ చిత్రం రేపు మూడు భాషల్లో రిలీజ్ కాబోతోంది. మరి వెంకటేష్ కష్టానికి ప్రతిఫలం లభిస్తుందో ? లేదో ? కొన్ని గంటల్లోనే తెలియనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.