సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. 2024 లోనే 100 కి పైగా(అన్ని భాషల్లోనే సినీ పరిశ్రమలతో కలుపుకుని) సినీ సెలబ్రిటీలు మరణించినట్టు అంచనా. వయసు మీద పడిన వారు, లేదంటే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు., లేదు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు.. ఇలా ఏదొక విధంగా సినిమా పరిశ్రమలో బ్యాడ్ న్యూస్లు వింటూనే ఉన్నాం. ఈరోజు ఉదయం ‘బలగం’ (Balagam) నటుడు మొగిలయ్య మరణించిన సంగతి తెలిసిందే.
Meena Ganesh
ఆ షాక్ నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే మరో షాక్ తగిలింది. ఓ మలయాళ సీనియర్ నటి కన్నుమూసినట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. మలయాళ సీనియర్ నటి మీనా గణేష్ (Meena Ganesh) ఈరోజు కన్నుమూసినట్టు సమాచారం. ఆమె వయసు 82 ఏళ్ళు అని తెలుస్తుంది. కొన్నాళ్లుగా ఆమె గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ వస్తోందట. ఈ క్రమంలో ఆమెను ఒట్టపాలెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు.
గత 5 రోజులుగా చికిత్స పొందుతూ వస్తున్న ఆమె ఈరోజు ఉదయం కన్నుమూసినట్టు సమాచారం. దీంతో మలయాళ చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మీనా గణేష్ దాదాపు 100కి పైగా సినిమాల్లో నటించిందట. అంతేకాకుండా 25 సీరియల్స్ లో కూడా నటించినట్టు తెలుస్తుంది.’రంగస్థల’ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె తర్వాత వాసంతి, లక్ష్మి, నామి,మీసా మాధవన్, కారుమడికుట్టన్, నందనం వంటి సినిమాలతో మలయాళ ఇండస్ట్రీలో పాపులర్ అయ్యింది. ఈమె మృతికి చింతిస్తూ మలయాళ నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.