Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » దేవదాసు, మాయా బజార్ లాంటి అనేక చిత్రాల్లో నటించిన సీత గారు కన్నుమూత!

దేవదాసు, మాయా బజార్ లాంటి అనేక చిత్రాల్లో నటించిన సీత గారు కన్నుమూత!

  • September 21, 2020 / 04:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దేవదాసు, మాయా బజార్ లాంటి అనేక చిత్రాల్లో నటించిన సీత గారు కన్నుమూత!

లైఫ్ ఈజ్ ఏ జర్నీ. ముందూ వెనుక, ఇరుపక్కల తోడెందరున్నా -మన ప్రయాణం మనదే. అందరితోనూ ఉంటూనే -తనదైన నడక, నడత, నర్తన సాగించిన అలనాటి పొందికైన నటి -పొట్నూరి సీతాదేవి. బాల్యంనుంచే ముఖానికి రంగేసుకోవడంతో ఏనభై ఐదేళ్లొచ్చినా -ఆమె ఇప్పటికీ బేబీ సీతే! దిగ్గజ దర్శకుడు కెవి రెడ్డి రూపొందించిన ‘యోగి వేమన’ నుంచి పరిశ్రమతో ప్రయాణించిన ఆమె జీవితంలో -ఎన్నో ఆటుపోట్లు. ఎన్నో ఎత్తుపలాలు. ఎనె్నన్నో అనుభవ పాఠాలు. లెక్కలేనన్ని జ్ఞాపకాలు. ఒకతరంతో నటిస్తూ.. నాలుగు తరాలకు ఆదర్శ నటిగా నిలిచిన ఆమె మస్తిష్కంలోని ముచ్చటైన మాటలే -ఈవారం వెన్నెల పాఠకుల కోసం.

1933 అక్టోబర్ 14న కాకినాడలో రామస్వామి దంపతుల ఒడిలో ప్రత్యక్షమైంది -సీత. బంధువు నీలాబాయి భర్త ఫిల్మ్ మేకర్ రాజా శాండో. అలా ఆమె సీతను కాకినాడ నుంచి మదరాసుకు దత్తపుత్రికగా తీసుకెళ్లారు. బాల్యంనుంచే నృత్యాలపట్ల మక్కువ పెంచుకుని అభ్యాసన మొదలెట్టారు. 1946లో కెవి రెడ్డి తొలిసారి దర్శకత్వ బాధ్యతలు వహిస్తూ రూపొందించిన ‘యోగి వేమన’లో బాలనటిగా కనిపించారు. అలా సీత -కథానాయిక చెల్లిగా కెవి రెడ్డి మనసులో ఉండిపోయింది. అప్పటి నుంచి ఆయన రూపొందించిన అనేక చిత్రాల్లో సీతకు పాత్ర లేకుండా లేదు. మంచి పాత్రలిస్తూ ప్రోత్సహించారు. హాస్యతారగా సరికొత్త మేనరిజమ్స్‌తో సీత ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కెవి రెడ్డి రూపొందించిన మాయాబజార్, గుణసుందరి కథ, పెళ్లినాటి ప్రమాణాలు, పెద్దమనుషులు తదితర చిత్రాల్లో హాస్యపాత్రలు, చెలికత్తె పాత్రలు ధరించారు.

అప్పట్లో హాస్య పాత్రధారిణులు ముగ్గురుండేవారు. వారిలో కనకం, సురభి బాలసరస్వతితో పాటు సీత ఎక్కువ చిత్రాల్లో కనిపించారు. సురభి బాలసరస్వతి, కనకం కొన్ని హాస్యపాత్రలకే పరిమితమైతే, తనలోని నటిని అన్ని రసాల్లో ఆవిష్కరించారు సీత. అలా కామెడీ మెడ్లీకి ఆద్యురాలయ్యారు సీత. షావుకారు చిత్రంలో జోగారావుతో మెడ్లీలో కనిపించి మెప్పించారు. లైలా- మజ్ను, సంసారం, ధిల్లగి చిత్రంలోని పాటలకు పేరడీ చేసి రూపొందించిన ఆ పాట తెలుగు సినీ చరిత్రలో మెడ్లీకి విత్తనంలాంటిది. పక్కనున్న హాస్యనటులను ఫూల్స్‌ను చేయడం, వాళ్లతో ఎకసెక్కాలాడి హాస్యం సృష్టించడం లాంటి పాత్రలు సీతకు వెన్నతో పెట్టిన విద్య. 1940 నుండి ప్రారంభమైన ఆమె సినీ ప్రస్థానం, 2002లో ‘నేనేరా పోలీస్’ వరకూ సాగింది. దాదాపు 250 చిత్రాల్లో నటించారు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే నటుడు నాగభూషణంతో కలిసి రక్తకన్నీరు, పాపం పండింది, ఇనుప తెరలు, అందరూ బతకాలి లాంటి నాటకాలు దాదాపు 2వేల ప్రదర్శనలిచ్చారు. ముఖ్యంగా నెలలో వారంపాటు వివిధ పట్టణాల్లో రోజుకొక నాటిక ప్రదర్శించేవారు. నాటకరంగం ఒకవైపు, సినిమారంగం మరోవైపు రెండు కళ్లుగా నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. లవంగి, జయసింహ, పల్లెటూరిపిల్ల, గుణసుందరి కథ, స్వర్ణసుందరి, స్వప్నసుందరి, పరమానందయ్య శిష్యులు, పల్నాటియుద్ధం, పంతులమ్మ, నలదమయంతి, భానుమతి నటించిన గృహప్రవేశం, సతీతులసి, అత్తా ఒకింటి కోడలే, ఋష్యశృంగ, సత్యహరిశ్చంద్ర, సంతోషిమాతవ్రతం, దేవదాసు,మాయాబజార్ వంటి గొప్ప చిత్రాల్లోనటించి తన ప్రతిభ చాటారు.

టీవీలో తొలి సీరియల్ ఋతురాగాల్లోనూ నటించి, తరువాత అనేక చానల్స్‌లో ధారావాహికలలో నటించి పేరు తెచ్చుకున్నారు. రక్తకన్నీరు నాటకం అనేక ప్రాంతాల్లో తిరిగి ప్రదర్శించే సమయంలో నటుడు నాగభూషణాన్ని 1956లో వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక దాదాపు కుటుంబానికే పరిమితమయ్యారు. కూతురు భువనేశ్వరి, కొడుకు సరేందర్. పక్కింటి అమ్మాయి చిత్రంలో అంజలి స్నేహితురాలిగా నటించారు. పాఠాలు చెప్పడానికి వచ్చిన హాస్యనటుడు అడ్డాల నారాయణరావును ఆటపట్టిస్తూ ఓ పాట పాడుతూ చేసిన నృత్యం ఆ సినిమాకి ప్రత్యేక గీతంగా నిలిచింది. భలేరాముడు చిత్రంలో రేలంగితో చేసిన ‘బంగరు బొమ్మా భలే జోరుగా పదవే పోదాం పైదేశం చూద్దాం’ పాట అప్పట్లో సూపర్‌హిట్. ముఖ్యంగా దర్శకుడు తిలక్ ‘అత్తా ఒకింటి కోడలే’ చిత్రంలో చెదలవాడ కుటుంబరావు, సీతలతో చేసిన పాట ‘తడికో తడిక’ ఇప్పటికీ వినిపిస్తూనే వుంటుంది. నాగేశ్వరరావు- జమున ప్రధాన తారాగణంగా కెవి రెడ్డి ‘పెళ్లినాటి ప్రమాణాలు’ చిత్రం రూపొందిస్తున్నారు. ఆ చిత్రంలో ఏఎన్నార్ రాజసులోచన ప్రేమలో పడతాడు. అది ఇష్టంలేని రాజసులోచన హీరోపై సీతను ప్రయోగిస్తుంది.

సీత ఓ పిచ్చి అమ్మాయిలా వచ్చి ఏఎన్నార్‌ను హడలిగొట్టి బయటకు పంపిస్తుంది. కమెడియన్లపై ప్రయోగించే కలకంఠి నటన హీరోపై కూడా ప్రయోగించమంటారా? అంటూ సెట్‌లో కెవి రెడ్డిని అడిగారట సీత. అదే సన్నివేశంలో ఓ డైలాగ్ కూడా వుంటుంది. అచ్చం హీరో నాగేశ్వరరావులాగా ఉన్నావే అన్నదే ఆ డైలాగ్. అదే డైలాగ్ సావిత్రి కెరీర్ తొలి చిత్రం ‘సంసారం’లోనూ వినిపిస్తుంది. అప్పుడు ఆ చిత్రంలో సావిత్రి అంటే, ఈ చిత్రంలో సీత అంటారు అదే డైలాగ్‌ను. ఈ విషయాన్ని కూడా కెవి రెడ్డి ప్రత్యేకంగా చెప్పి సీతచేత ఆ పాత్రను చేయించడం విశేషం. నాటకాలు వేసే సమయంలో నాటక సమాజంతో కలిసి అనేక ఊళ్లు తిరిగేవారు. ఓసారి ముమ్మిడివరంలో నాటకం ప్రదర్శించాలి. కానీ నాటకం వేయిస్తున్న కాంట్రాక్టర్‌కు ఊళ్లో కొంతమందికి గొడవలు జరగడంతో నాటకం రద్దుచేశారు. ఆ రాత్రి భోరున వాన. నాటకం వేయాల్సిన థియేటర్‌వద్ద ఏం జరుగుతుందో చూద్దామని నటుడు నాగభూషణం బయలుదేరారు తమ బసనుండి. ఆయనతోపాటుగా నాటకం ప్రదర్శించే నటులు మామ సత్యం మరికొందరు బయలుదేరారు. వారితోపాటుగా సీతకూడా బయలుదేరింది.

అక్కడికెందుకు, గొడవలు జరుగుతున్నాయి, నువ్వు రావద్దు అంటూ వారించారు నాగభూషణం. అయినాకానీ ఆమె పట్టువీడలేదు. ఫాంటు, షర్టు తగిలించుకొని తలపాగా చుట్టుకొని ఓ సిగరెట్ చేతిలో పెట్టుకుని వారితోపాటు వెళ్లారు. థియేటర్ వద్ద ఆమెను ఎవ్వరూ గుర్తుపట్టలేదు. అక్కడికివెళ్లి గొడవ సర్దుబాటుచేసి వచ్చారు. మొత్తానికి అక్కడికి ధైర్యంగా వచ్చినందుకు నాగభూషణం మెచ్చుకున్నారు. హిందీలో రూపొందించిన ‘అల్‌బేలా’ చిత్రాన్ని నాగభూషణం తెలుగులో నాటకాల రాయుడుగా రూపొందించారు. ఆ చిత్రంలో ఆయన వదిన పాత్రలో విషాద ఛాయలు పలికిస్తూ ఆమె చేసిన నటన అందరినీ కదిలించింది. ఓ హాస్యనటి జీవితంలో ఓ విలక్షణమైన పాత్రగా అందరూ అభివర్ణించారు. పిల్లలకు పెళ్లిళ్ళు అయ్యాక తనకు వీలు వున్ననాళ్లు సినిమాల్లో నటించేవారు. సినిమా పరిశ్రమలో ఉన్న అనేకమంది, బంధువులకు కష్టాలను విని గుప్తాదానాలు ఎన్నో చేశారు. ఇటీవల యువకళావాహిని రేలంగితో అనేక హాస్య పాత్రల్లో నటించిన సీతను గుర్తించి, ఆమెకు రేలంగి పురస్కారం ప్రదానం చేశారు. ఆ సభలో ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. రేలంగితో నటించి ఆయన అవార్డు అందుకోవడం ఓ పెద్ద అవార్డుగా తాను భావిస్తున్నానని, తనను ఆదరించిన అనేకమంది దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు చెబుతున్నానని అంటారామె.

గొప్ప వ్యక్తిత్వం: అనిత
===============
సీతగారు, నేను అనేక చిత్రాల్లో నటించాం. ఎవరినైనా నాన్నా, అమ్మా అని ఆప్యాయంగా పలకరిస్తారు. సొంత తల్లిలా ఆదరించేవారు. నాటకాల రాయుడులో నాకు వదినగా నటించారు. స్టేజీ ఆర్టిస్టు అవ్వడంతో ఏ పాత్రనైనా అద్భుతంగా చేసేవారు. ఆమె నటించిన పాత్రకు జీవముండేది. సినిమాలో పాత్రలు చెప్పక్కర్లేదు. గొప్ప వ్యక్తిత్వం వున్న నటీమణి సీత.

తొలినాళ్ల గురువు:వాణిశ్రీ !
=================
నేను అప్పుడప్పుడే డ్యాన్స్ నేర్చుకుంటున్నా. వేణుగోపాల్ మాస్టార్ వద్ద ఝాన్సీ, ఇంద్రాణి ఉండేవారు. గరికపాటి రాజారావు నన్ను చూసి మా అమ్మకు నాటకాల్లో నటింపజేయమని సలహా ఇచ్చారు. రక్తకన్నీరు నాటకంలో నటించడానికి ఓ మంచి నటి కావాలని మామ సత్యం అనే మా ఇంటిపక్కనున్న ఓ టెక్నీషియన్ మా అమ్మను అడిగారు. ఆయనే నన్నూ, మా అమ్మగారిని నాగభూషణం ఇంటికి ఇంటికి తీసుకువెళ్లారు. అప్పుడే నన్ను సీతగారు తొలిసారి చూశారు. డైలాగులన్నీ రాసిస్తాను, చక్కగా ప్రాక్టీసు చేయి అని, తెలుగు డైలాగులు ఎలా చెప్పాలో నాకు నేర్పించారు. నువ్వేమీ భయపడకు, స్టేజీపై మేము ఉంటాం కదా! చక్కగా నటించాలి అని ప్రోత్సహించేవారు. అలా వారి ట్రూపులో చేరాను. చేరిన వెంటనే నువ్వు ఎక్కువకాలం మా గ్రూపులో వుండవు. పెద్ద హీరోయిన్‌ని అయిపోతావు అని జోస్యం చెప్పారామె. అలా మనిషిని చూడగానే ఎలా చెబుతారో నాకు ఇప్పటికీ అర్థంకాదు. చురుకైన వ్యక్తి. గొప్ప ప్రతిభగల నటి. అంతకుమించి సంస్కారం వున్న గృహిణి. చాలా తెలివైనది. ఓ పెద్ద నటుడి భార్యననిగాని, మంచి నటిననిగాని ఏనాడూ భేషజం చూపించేవారు కాదు. చాలా సింపుల్‌గా ఉండేవారు. ఆమె ప్రోత్సాహం ఎన్నటికీ మర్చిపోలేనిది. నా కెరీర్ తొలినాళ్ళల్లో దొరికిన ఓ అద్భుతమైన గురువు ఆమె.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Seetha

Also Read

Balakrishna: మళ్లీ పాడబోతున్న బాలయ్య.. క్లారిటీ ఇచ్చిన సంగీత దర్శకుడు.. ఆ సినిమాలోనే..

Balakrishna: మళ్లీ పాడబోతున్న బాలయ్య.. క్లారిటీ ఇచ్చిన సంగీత దర్శకుడు.. ఆ సినిమాలోనే..

Mowgli Collections: మొదటి సోమవారం ‘మోగ్లీ’ అత్యంత దారుణమైన కలెక్షన్లు

Mowgli Collections: మొదటి సోమవారం ‘మోగ్లీ’ అత్యంత దారుణమైన కలెక్షన్లు

Akhanda 2 Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Rishab Shetty: రణ్వీర్ సింగ్ ఇమిటేషన్ ఇబ్బంది పెట్టింది.. ఓపెన్ అయిపోయిన రిషబ్ శెట్టి

Rishab Shetty: రణ్వీర్ సింగ్ ఇమిటేషన్ ఇబ్బంది పెట్టింది.. ఓపెన్ అయిపోయిన రిషబ్ శెట్టి

OG: ‘ఓజి’ దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ధర ఎంతో తెలుసా?

OG: ‘ఓజి’ దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ధర ఎంతో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

related news

Spirit: ఆ సీన్ లో అంతకుమించిన వైలెన్స్

Spirit: ఆ సీన్ లో అంతకుమించిన వైలెన్స్

Avatar 3: ఆ ఒక్కటి వర్సెస్ పది సినిమాలు.. ఎండింగ్ వార్ మామూలుగా లేదుగా!

Avatar 3: ఆ ఒక్కటి వర్సెస్ పది సినిమాలు.. ఎండింగ్ వార్ మామూలుగా లేదుగా!

Chiranjeevi: సంక్రాంతి సందడిలో మెగాస్టార్ సినిమాను మర్చిపోయారా?

Chiranjeevi: సంక్రాంతి సందడిలో మెగాస్టార్ సినిమాను మర్చిపోయారా?

Puri Jagannadh: ఆ సీక్రెట్ ఈయనకు కూడా తెలుసు.. టాలీవుడ్ లో మరో స్పీడ్ గన్!

Puri Jagannadh: ఆ సీక్రెట్ ఈయనకు కూడా తెలుసు.. టాలీవుడ్ లో మరో స్పీడ్ గన్!

Balakrishna: మళ్లీ పాడబోతున్న బాలయ్య.. క్లారిటీ ఇచ్చిన సంగీత దర్శకుడు.. ఆ సినిమాలోనే..

Balakrishna: మళ్లీ పాడబోతున్న బాలయ్య.. క్లారిటీ ఇచ్చిన సంగీత దర్శకుడు.. ఆ సినిమాలోనే..

Mowgli Collections: మొదటి సోమవారం ‘మోగ్లీ’ అత్యంత దారుణమైన కలెక్షన్లు

Mowgli Collections: మొదటి సోమవారం ‘మోగ్లీ’ అత్యంత దారుణమైన కలెక్షన్లు

trending news

Balakrishna: మళ్లీ పాడబోతున్న బాలయ్య.. క్లారిటీ ఇచ్చిన సంగీత దర్శకుడు.. ఆ సినిమాలోనే..

Balakrishna: మళ్లీ పాడబోతున్న బాలయ్య.. క్లారిటీ ఇచ్చిన సంగీత దర్శకుడు.. ఆ సినిమాలోనే..

4 hours ago
Mowgli Collections: మొదటి సోమవారం ‘మోగ్లీ’ అత్యంత దారుణమైన కలెక్షన్లు

Mowgli Collections: మొదటి సోమవారం ‘మోగ్లీ’ అత్యంత దారుణమైన కలెక్షన్లు

7 hours ago
Akhanda 2 Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

8 hours ago
Rishab Shetty: రణ్వీర్ సింగ్ ఇమిటేషన్ ఇబ్బంది పెట్టింది.. ఓపెన్ అయిపోయిన రిషబ్ శెట్టి

Rishab Shetty: రణ్వీర్ సింగ్ ఇమిటేషన్ ఇబ్బంది పెట్టింది.. ఓపెన్ అయిపోయిన రిషబ్ శెట్టి

9 hours ago
OG: ‘ఓజి’ దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ధర ఎంతో తెలుసా?

OG: ‘ఓజి’ దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ధర ఎంతో తెలుసా?

11 hours ago

latest news

Telugu Director : త్వరలోనే తండ్రి దర్శకత్వంలో కుమారుడు.. ఇంతకీ ఎవరంటే..?

Telugu Director : త్వరలోనే తండ్రి దర్శకత్వంలో కుమారుడు.. ఇంతకీ ఎవరంటే..?

9 hours ago
Anil Ravipudi: ఆ క్యారెక్టర్‌ స్ఫూర్తి ఆ కల్ట్‌ సినిమానే.. నా కొడుకుని కూడా మారుస్తున్నాను.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Anil Ravipudi: ఆ క్యారెక్టర్‌ స్ఫూర్తి ఆ కల్ట్‌ సినిమానే.. నా కొడుకుని కూడా మారుస్తున్నాను.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

11 hours ago
Upasana Kamineni : మోస్ట్ పవర్ ఫుల్ బిజినెస్ ఉమెన్ గా మెగా కోడలు ఉపాసన..!

Upasana Kamineni : మోస్ట్ పవర్ ఫుల్ బిజినెస్ ఉమెన్ గా మెగా కోడలు ఉపాసన..!

12 hours ago
Naga Chaitanya : పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘వృషకర్మ’ తరువాత చైతన్య చేయబోయేది ఆ దర్శకుడితోనేనా..?

Naga Chaitanya : పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘వృషకర్మ’ తరువాత చైతన్య చేయబోయేది ఆ దర్శకుడితోనేనా..?

13 hours ago
Tg Vishwaprasad: అకీరాను లాంచ్‌ చేయాలని ఉంది.. మనసులో మాట బయట పెట్టిన నిర్మాత

Tg Vishwaprasad: అకీరాను లాంచ్‌ చేయాలని ఉంది.. మనసులో మాట బయట పెట్టిన నిర్మాత

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version