Telugu Director : తక్కువ రోజులలో సినిమాలు డైరెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి, హీరోలను స్టార్స్ గా నిలబెట్టిన టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్. తన మార్క్ డైలాగ్స్ తో ప్రేక్షకులను మెప్పించటం ఆయనలోని ప్రత్యేకత. కథ, స్క్రీన్ ప్లే, మాటలు అన్ని తాను ఒక్కడే డీల్ చేస్తూ సినిమాను డైరెక్ట్ చేయటంలో దిట్ట దర్శకుడు పూరీ. ఒకానొక సమయంలో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టి సంచలనం సృష్టించాడు. ఈ మధ్య వరుస డిజాస్టర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు ఈ డైరెక్టర్.
అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తండ్రి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సినిమా ఎప్పుడు చేస్తారని యాంకర్ అడుగగా డైరెక్టర్ పూరి కొడుకు ఆకాష్ ఈ విధంగా స్పందించారు. త్వరలోనే తన తండ్రి పూరి డైరెక్షన్ లో సినిమా చేసే సమయం చాలా దగ్గరలోనే ఉంది అని తెలిపారు. ప్రస్తుతానికి పూరి – విజయ్ సేతుపతి కాంబోలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆకాష్ కూడా తన తదుపరి చిత్రం పనుల్లో బిజీ బిజీగా ఉన్నాడు.

ఇకపోతే పూరి చిత్రాల్లో ఛాన్స్ ఉంటే ఏ చిత్రాన్ని రీమేక్ చేస్తారని అని అడుగగా, ఆకాష్ తనకు ‘నేనింతే’ చిత్రం అంటే చాలా ఇష్టమని, అవకాశం వస్తే ఆ సినిమాని రీమేక్ చేస్తానని తెలిపారు. నిజానికి ‘నేనింతే’ మూవీ థియేటర్లలో అంత ఆడకపోయినా కూడా ఆ సినిమాకు సెపెరేట్ ఫ్యాన్స్ ఉన్నారు.
