ఎవరెన్ని చెప్పినా పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ సినిమాల్లోకి రావడం పక్కా. మధ్యలో కొంతమంది రాడు, ఇంట్రెస్ట్‌గా లేడు అని కామెంట్లు చేసినా.. ఆయన రాక పక్కా. ఎందుకంటే టాలీవుడ్‌లో ఉన్న ఆనవాయితీ ఇది. దానికి తోడు హీరో మెటీరియల్ అని లుక్స్ చూసి చెప్పేయొచ్చు. అయితే ఎప్పుడు పవన్ రైట్ అంటాడు అనేదే ఇక్కడ విషయం. ఆయన అలా రైట్ అనాలి కానీ.. లాంచింగ్‌కి నిర్మాతలు రెడీ అవుతారు. దర్శకుల విషయం మాత్రం ఇంకా తెలియదు. ఈ నిర్మాతల లిస్ట్‌లో చాలా రోజులుగా వినిపిస్తున్న ఒకరు ఇప్పుడు ఓపెన్ అయ్యారు.
పవన్ కల్యాణ్‌తో ఇటీవల అకీరా ఎక్కువగ కనిపిస్తున్నాడు. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత నుండి మరీ ఎక్కువగా కనిపిస్తున్నాడు. అప్పటివరకు విదేశాల్లో చదువుకొని, పుణెలో ఉన్న అకీరా.. ఇప్పుడు హైదరాబాద్, విశాఖపట్నంలో ఎక్కువగా కనిపిస్తున్నాడని టాక్. కారణమేంటా అని చూస్తే.. హైదరాబాద్‌లో ఉంటూ ఫిజికల్ లుక్ మీద.. విశాఖపట్నంలో ఉంటూ యాక్టింగ్ మెళకువల మీద దృష్టి పెట్టి శిక్షణ తీసుకుంటున్నాడని తెలిసింది. అయితే ఇది అధికారిక సమాచారం కాదు.

చూస్తుంటే మరో రెండేళ్లలో అకీరా లాంచ్ ఉంటుంది అని చెబుతున్నారు. మరి మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా లాంచింగ్‌కి అని ప్రముఖ నిర్మాత, పవన్ కల్యాణ్ సన్నిహితుడు టీజీ విశ్వప్రసాద్ దగ్గర ప్రస్తావిస్తే ఆసక్తికర సమాధానం ఇచ్చారు. అకీరాను లాంచ్ చేసే ఛాన్స్ వస్తే.. అకీరాతో పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ మూవీ చేస్తానని మనసులో మాట చెప్పేశారు విశ్వప్రసాద్. పవన్‌తో తన పరిచయం, బంధం సినిమాలతో సంబంధం లేకుండా జరిగిందని తెలిపారు. పవన్‌తో రిలేషన్ పెరిగాక పీపుల్ మీడియాలో సినిమా చేశారు కానీ.. సినిమా చేశాక తాము కలవలేదు అని చెప్పారు.
ఇక పవన్‌తో మరో సినిమా చేయాలని అనుకుంటున్నామని.. కానీ ఇంకా నిర్ణయాలు ఏవీ జరగలేదని చెప్పారు. ఇక అకీరాను లాంచ్ చేసే అవకాశం వస్తే కచ్చితంగా చేస్తాం. అకీరా హైట్, పర్సనాలిటీని చూస్తే పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ అని చెప్పారు విశ్వప్రసాద్.
