విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరు.అంతేకాకుండా ఒకప్పటి స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరైన రామానాయుడు గారి చిన్నబ్బాయి… అలాగే ఇప్పటి స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి తమ్ముడు. సినిమాల్లో తన నటనతో అలరిస్తాడు, కామెడీతో నవ్విస్తాడు, ఎమోషనల్ సీన్స్ లో కంటతడి పెట్టిస్తాడు.ఎటువంటి పాత్రనైనా ఓన్ చేసుకుని అవలీలగా పండిస్తూ ఉంటాడు వెంకటేష్.తాజాగా ‘నారప్ప’ మూవీలో ఇతని నట విశ్వరూపాన్ని మరోసారి చూపించాడు వెంకీ. ఇదిలా ఉండగా.. విక్టరీ వెంకటేష్ మొదటి మూవీ ఏది అని అడిగితే..
ఎవ్వరైనా సరే టక్కున చెప్పే పేరు ‘కలియుగ పాండవులు’. అయితే అంతకు ముందే ఆయన ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.అది కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా..! 1971వ సంవత్సరంలో రామానాయుడు గారి నిర్మాణంలో ‘ప్రేమ్ నగర్’ అనే మూవీ వచ్చింది. అప్పట్లో ఇది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో వెంకటేష్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు.ఈ మూవీ కోసం రూ.1000 పారితోషికంగా తీసుకున్నాడట వెంకీ.
అలా వెంకీ ‘ప్రేమ్ నగర్’ చిత్రంతో తెరంగేట్రం చేయడం జరిగింది. అటు తర్వాత వెంకటేష్ చదువు పాడవ్వకూడదు అనే ఉద్దేశంతో మళ్ళీ సినిమాల వైపుకి రానివ్వలేదు రామానాయుడు గారు. అటు తర్వాత వెంకీ పై చదువుల నిమిత్తం విదేశాల్లో ఉన్నప్పుడు ‘కలియుగ పాండవులు’ చిత్రంలో నటించడానికి ఆయన్ని రప్పించారు.