పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ అవుతోంది అంటే ఆయన తనయుడు అకీరా నందన్.. ఆయనకు కల్ట్ ఫ్యాన్‌గా మారిపోతాడు. గతంలో చాలా సందర్భాల్లో ఇది చూశాం కూడా. ఇక మేనల్లుళ్లు సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ సంగతి సరేసరి. అలాంటోళ్లు ఇప్పుడు మచ్ హైప్ ఉన్న ‘ఓజీ’ సినిమా గురించి ఇంకెంత సందడి చేస్తారో మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు అదే జరిగింది. బుధవారం రాత్రి వేసిన ‘ఓజీ’ సినిమా ప్రీమియర్లకు ‘ఓజీ’ వారసులు రచ్చ రచ్చ చేశారు. వారిని చూసి ఫ్యాన్స్ ఇంకా ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
OG
పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండుగలా ఉంటుందంటూ తొలుత నుండి హైప్‌ను పెంచుతూ వచ్చిన ‘ఓజీ’ బుధవారం రాత్రి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతం వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా సంబరాలు అంబరాన్నంటగా బుధవారం వేరే లెవల్‌లోకి వెళ్లాయి. మెగా ఫ్యామిలీ యంగ్ హీరోలు వరుణ్ తేజ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్, పవన్ వీరాభిమాని స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, పవన్ తనయుడు అకీరా, కుమార్తె ఆద్య థియేటర్లలో సందడి చేశారు. వీరితోపాటు ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ప్రీమియర్ షోకి వచ్చారు.
యంగ్ హీరో నాని ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ అని తేల్చేశారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌ను బిగ్ స్క్రీన్‌పై చూశాను. పవర్‌స్టార్ ఒక అద్భుతం. సుజీత్, తమన్‌ల గురించి మాటల్లో చెప్పలేను. బ్లాక్‌బస్టర్ ఈ సినిమా అని దర్శకుడు బాబీ పోస్ట్ చేశారు. వీరే కాదు.. మిగిలిన సెలబ్రిటీలు ప్రస్తుతం తమ ఎక్స్ పోస్టులు పెట్టే పనిలో ఉన్నారు. ఈ లోపు సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు చూసేయండి.