విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా ‘మహారాజ’ తర్వాత ఈ ఏడాది వచ్చిన చిత్రం ‘విడుదల 2’ (Vidudala Part 2). 2023 లో వచ్చిన ‘విడుదల’ మొదటి భాగం క్రిటిక్స్ నుండి మంచి రెస్పాన్స్ ని రాబట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా సత్తా చాటలేకపోయినా ఓటీటీలో మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. సెకండ్ పార్ట్ పై ఆసక్తి ఏర్పడేలా చేసింది. కానీ రెండో పార్ట్ ను దర్శకుడు వెట్రిమారన్ (Vetrimaaran) సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు.
Vidudala Part 2 Collections:
మొదటి భాగంలో హీరో అయినటువంటి సూరిని కూడా సైడ్ చేసేయడం, కథనం కూడా వీక్ గా సాగడం వల్ల ‘విడుదల 2’ ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది.తమిళంలో బాగానే ఓపెనింగ్స్ రాబట్టినా.. తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా నిరాశపరిచినట్టు అయ్యింది. క్రిస్మస్ హాలిడేని కూడా ఈ సినిమా క్యాష్ చేసుకోలేకపోయింది. ఒకసారి (Vidudala Part 2) 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
‘విడుదల 2’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.3.0 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజుల్లో ఈ సినిమా రూ.0.62 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా రూ.2.88 కోట్ల షేర్ ను రాబట్టాలి. ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) ‘ముఫాసా’ వంటి సినిమాలు పోటీగా ఉండటం వల్ల ‘విడుదల 2’ నిలబడలేకపోతుంది అని చెప్పాలి.