టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఏ విషయానికి భయపడరు. తను ఏమనుకుంటే అది ధైర్యంగా మాట్లాడతారు. ఏం చేయాలనుకుంటే అది చేస్తారు. ఈ క్రమంలో అతడి మాటలు, చర్యలు ఒక్కోసారి వివాదాస్పదమవుతుంటాయి. ఎవరెంత ట్రోల్ చేసినా.. విజయ్ మాత్రం పెద్దగా పట్టించుకోరు. అయితే అన్నిసారి అతడి యాటిట్యూడ్ కలిసొస్తుందని అనుకోవడానికి లేదు. రీసెంట్ గా అతడు చేసిన కామెంట్ ‘లైగర్’ సినిమాని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది.
కొంతకాలంగా హిందీ సినిమాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే నడుస్తోంది. రకరకాల కారణాలు చూపించి బాలీవుడ్ స్టార్ల సినిమాలను బాయ్‌కాట్ చేస్తున్నారు నెటిజన్లు. కావాలనే సినిమాల మీద నెగెటివ్ ప్రచారం చేసి వాటిని చంపేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెగెటివ్ ట్రెండ్ గురించి ఎవరైనా విమర్శలు చేస్తున్నా.. విడిచిపెట్టడం లేదు నెటిజన్లు. తాము వ్యతిరేకిస్తున్న ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాను హృతిక్ రోషన్ పొగిడాడని..
అతడి సినిమా ‘విక్రమ్ వేద’ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా వాళ్లకు టార్గెట్ అవుతాడేమో అనిపిస్తుంది. ‘లైగర్’ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ ఈ బాయ్‌కాట్ ట్రెండ్ గురించి మాట్లాడారు. బాయ్‌కాట్ చేయాలని ట్రెండ్ చేసేవాళ్లకు అవసరానికి మించి అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.
అంతేకాకుండా.. బాయ్‌కాట్ చేస్తే చేయనివ్వండి.. వాళ్లు అలా ట్రెండ్ చేస్తే ఏమవుతుంది..? థియేటర్లకు వెళ్లి సినిమా చూసేవాళ్లు చూస్తారు, లేదంటే ఓటీటీలో చూస్తారు. అంతకుమించి ఏమీ అవ్వదని తేల్చి చెప్పారు. ఈ కామెంట్స్ పై బాయ్‌కాట్ బ్యాచ్ ఎలా రియాక్ట్ అవుతుందోనని ఆందోళల చెందుతుంది ‘లైగర్’ టీమ్.