Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ పంచ్‌… మొన్న కన్నడకి.. ఇప్పుడు తమిళ్‌కి?

విజయ్‌ దేవరకొండ యాటిట్యూడ్ అంటే ఏంటో తెలుగు ప్రేక్షకులకు, మీడియాకు బాగా తెలుసు. ‘లైగర్‌’ సినిమా ప్రచారంలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో ప్రచారం చేసినప్పుడు వాళ్లకు కూడా కాస్త పరిచయం అయింది. అయితే ఇప్పుడు అదే యాటిట్యూడ్‌తో ఇతర రాష్ట్రాల్లో మీడియాకు చిన్నపాటి క్లాస్‌లు పీకుతున్నాడు, ఇరికిద్దాం అనుకునేవాళ్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఎందుకులే మనకు అనే ఆలోచనలో కాకుండా నన్ను అంటే నేను అంటా అనే కాన్సెప్ట్‌లో ఉంటున్నాడు. మొన్నీమధ్య ‘ఖుషి’ సౌత్‌ ప్రెస్‌ మీట్‌లో భాగంగా కన్నడ మీడియా పర్సన్‌కు భలే కౌంటర్‌ ఇచ్చాడు.

అదేం ఇచ్చాడు, ఏం అన్నాడు అనేది తర్వాత చూద్దాం. లేటెస్ట్‌ అయితే విజయ్‌ కౌంటర్‌ పడింది తమిళ వాళ్ల మీద. ‘ఖుషి’ ప్రచారం కోసం తమిళనాడు వెళ్లి విజయ్‌ ప్రచారం చేశాడు. ఈ క్రమంలో సీనియర్‌ స్టార్‌ హీరోల సినిమాల ఫలితాల గురించి మాట్లాడి వావ్‌ అనిపించాడు. ఇప్పుడు తనకు తమిళ దర్శకులు తెలియదు అనే యాంగిల్‌లో ప్రశ్న పడితే సరైన కౌంటర్‌ ఇచ్చాడు. ఓ తమిళ మీడియా పర్సన్‌ విజయ్‌తో మాట్లాడుతూ ‘తమిళ దర్శకులు లోకేష్ కనగరాజ్, వెట్రిమారన్ తప్ప మిగిలినవాళ్ల గురించి మీకు అంతగా తెలియదు కదా’ అని అన్నారు.

మామూలుగా అయితే తెలుసు అని కౌంటర్‌ ఇచ్చి ఇష్యూ కామ్‌ చేస్తారు. కానీ విజయ్‌ తన సమాధానంగా తమిళ మీడియా పర్సన్‌ను మామూలు కామ్‌, పిండ్రాప్‌ కామ్‌ చేశాడు. ‘నాకు అరుణ్‌ ప్రభు అంటే ఇష్టం. అతనెవరో మీకు తెలుసా? అంటూ కౌంటర్‌ స్టార్ట్‌ చేశాడు. ‘అరువి’ లాంటి అద్భుతమైన చిత్రం తీసింది ఆయనే.. నీకు తెలుసా? అని కౌంటర్‌ను పెంచాడు కూడా. ఆ తర్వాత ‘వాజి’ అనే సినిమా చేశారని, అలాగే ధనుష్‌తో ‘కెప్టెన్ మిల్లర్’ తీస్తున్న అరుణ్ మాతేశ్వరన్‌ గురించి కూడా విజయ్‌ మాట్లాడాడు.

ఆ తర్వాత శ్రీకార్తిక్ ప్రస్తావన తీసుకొచ్చాడు. దీంతో ఆ పర్సన్‌కి మాట రాలేదు. విజయ్‌ను కౌంటర్‌ చేద్దామనుకుంటే తిరిగి ఫుల్‌ క్లారిటీ వచ్చేసింది. ఇక ఆ మధ్య కన్నడ ‘పవర్‌ స్టార్‌’ అంటూ ఓ కన్నడ జర్నలిస్ట్‌ మాట్లాడితే తెలుగు ‘పవర్‌ స్టార్‌’ గురించి తెలుసా? అంటే వెంటనే (Vijay Devarakonda) విజయ్‌ కౌంటర్‌ ఇచ్చాడు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus