Vijay Devarakonda: కష్టాల్లో ఉన్న డ్యాన్సర్ కోసం విజయ్ సాయం!

తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా వేదికగా ఇప్పటికే ఎన్నో సరికొత్త కార్యక్రమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఇప్పటికే సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలు, టాక్ షోలు, సినిమాలు వెబ్ సిరీస్లను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. అయితే మొట్టమొదటిసారిగా ఆహా వేదికగా డాన్స్ ఐకాన్ కార్యక్రమాన్ని లాంచ్ చేశారు. ఈ డాన్స్ షో ని సెప్టెంబర్ 11వ తేదీ నుంచి ప్రసారం చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున సెలబ్రిటీ హాజరై సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ యాంకర్ ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఎవరైతే విజయం సాధిస్తారో వారికి పెద్ద హీరోకి కొరియోగ్రఫీ చేసే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా లైజర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా విజయ్ దేవరకొండ అనన్య పాండే హాజరయ్యారు. ఇక వేదికపై లైగర్ సినిమాలోని అకిడి పకీడి అనే పాటకు వీరిద్దరూ డాన్స్ చేస్తూ సందడి చేశారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఒక్కో కంటెస్టెంట్ వేదికపై అద్భుతమైన పర్ఫామెన్స్ చేశారు.

అయితే ఆనంద్ అనే కంటెస్టెంట్ అమ్మ సెంటిమెంటుతో వేదికపై డాన్స్ చేశారు. ఇక తన గురించి ఓంకార్ చెబుతూ ఆనంద్ కు అమ్మ అంటే ఎంతో ఇష్టం అందుకే అమ్మ పాట ద్వారా వేదిక పైకి వచ్చారని తెలిపారు. ఇక ఆనంద్ తల్లి ప్రస్తుతం త్రోట్ క్యాన్సర్ తో బాధపడుతూ హాస్పిటల్ పాలయ్యారని తనకి తన తల్లికి హాస్పిటల్లో చికిత్స చేయించడానికి డబ్బులు ఇబ్బందిగా ఉందని అలాగే ఒక మంచి కాస్ట్యూమ్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకపోవడంతో సాధారణ దుస్తులతో వేదికపైకి వచ్చి డాన్స్ చేస్తున్నారని ఓంకార్ చెప్పగానే విజయ్ దేవరకొండ ఎమోషనల్ అయ్యారు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తను ఫస్ట్ సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చేస్తున్న సమయంలో తన దగ్గర కూడా ఏమాత్రం దుస్తులు లేవని ఈ సినిమా ప్రమోషన్ కోసం ప్రొడ్యూసర్ ని అడిగి సినిమాలో వేసుకున్న కాస్ట్యూమ్ వేసుకొని ప్రమోషన్ కి వెళ్ళానని తెలిపారు. కాస్ట్యూమ్ లేవని బాధపడకు తన రౌడీ వేర్ నుంచి తనకు అన్ని పంపుతానని తనకు నచ్చిన స్టైల్ వేసుకుని పర్ఫామెన్స్ చేయమని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ కంటెస్టెంట్ కి బట్టలు పంపిస్తూ తన మంచి మనసు చాటుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!


‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus