కొన్ని సినిమాలు లేదా క్యారెక్టర్లు కొందరు నటీనటులపై ఏస్థాయిలో ఇంపాక్ట్ చూపిస్తాయంటే.. జనాలు వాళ్ళని వాళ్ళ సొంత పేర్లతో కాకుండా ఆ క్యారెక్టర్ నేమ్స్ తోనే పిలుస్తుంటారు. విజయ్ దేవరకొండను అలా జనాలకు చేరువ చేసిన చిత్రం “అర్జున్ రెడ్డి”. ఆ సినిమా తర్వాత చాన్నాళ్లవరకూ మనోడ్ని అందరూ అర్జున్ రెడ్డి అనే పిలిచేవారు. ఇప్పటికీ విజయ్ ఫ్యాన్స్ అతడ్ని అర్జున్ రెడ్డి అనే పిలుచుకొంటారు. ఆ సినిమా తర్వాత విజయ్ కి హిట్స్ వచ్చాయి కానీ.. జనాల మీద ఆస్థాయి ఎఫెక్ట్ మాత్రం చూపించలేకపోయాయి.
ఆ లోటును “డియర్ కామ్రేడ్” తీరుస్తుందని విశేషమైన నమ్మకంతో ఉన్నాడు విజయ్ దేవరకొండ. “డియర్ కామ్రేడ్” ఒక స్వచ్చమైన ప్రేమకథ అని.. కాకినాడ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో లవ్, పెయిన్ ఆడియన్స్ ను, ముఖ్యంగా యూత్ ను బాగా ఆకట్టుకొంటుందని విజయ్ నమ్మకంగా ఉన్నాడు. ఇక నిన్న సెన్సార్ పూర్తి చేసుకొన్న “డియర్ కామ్రేడ్” రన్ టైమ్ కూడా 10 నిమిషాలు తక్కువ మూడు గంటలు ఉండడం చూసి కొందరు ఆందోళణ వ్యక్తం చేసినా.. విజయ్ మాత్రం ఇది మరో అర్జున్ రెడ్డి లాంటిది అని భరోసా ఇచ్చాడట. మరి విజయ్ నమ్మకం నిలబడుతుందో లేదో తెలియాలంటే మరోవారం వెయిట్ చేస్తే సరిపోతుంది.