Vijay Devarakonda: సమంత ఆరోగ్యం గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన విజయ్!

విజయ్ దేవరకొండ సమంత జంటగా నటించిన చిత్రం ఖుషి. ఈ సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే హైదరాబాదులో ఈ సినిమా మ్యూజిక్ కాన్సర్ట్ ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు. అయితే ఈ కార్యక్రమంలో సమంత విజయ్ దేవరకొండ పర్ఫామెన్స్ ఎంతో అద్భుతంగా ఉందని చెప్పాలి అయితే ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ సమంత గురించి పలు విషయాలు తెలియజేశారు.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ హిట్ అనే పదం విని చాలా రోజులవుతుంది ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టి అందరిని ఖుషి చేయాలని అనుకుంటున్నాను ముఖ్యంగా సమంత మొహంలో తాను నవ్వు చూడాలని అనుకుంటున్నాను అంటూ విజయ్ దేవరకొండ మాట్లాడారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సమంత ఆరోగ్య సమస్యల గురించి కూడా ఈయన వెల్లడించారు. అందరం ఎంతో సంతోషంగా నవ్వుతూ ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాము 60% షూటింగ్ కూడా పూర్తి అయింది

అయితే సమంతకు సంబంధించిన 30% షూటింగ్ ఉంది మూడు రోజులు వస్తే షూటింగ్ పూర్తి అవుతుంది.కానీ తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి రెండు రోజులు రెస్ట్ తీసుకుంది రెండు రోజుల తర్వాత తన వల్ల కాలేదంటూ ఆమె రెండు మూడు వారాలు రెస్ట్ తీసుకుంది. అయితే చాలా రోజుల తర్వాత తాను ఇలాంటి ఒక వ్యాధితో బాధపడుతుందని తెలిసి చాలా బాధపడ్డామని తెలిపారు. ఇక సమంత పూర్తిగా కోలుకొని వచ్చేవరకు షూటింగ్ నిలిపివేయాలని అందరూ భావించాము అయితే సమంత ఈ సమస్య కారణంగా చాలా ఇబ్బంది పడిందని విజయ్ తెలిపారు.

ఇప్పటికి తను ఆరోగ్యం బాగాలేదని లైట్స్ పడితే తనకు తీవ్రమైన తలనొప్పి వస్తుందని అయినప్పటికీ సినిమా కోసం తాను ఇక్కడికి వచ్చిందని తెలిపారు.ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందని ఆ సంతోషం సమంత మొహంలో తాను చూడాలని ఈ సందర్భంగా సమంత గురించి అలాగే ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుతూ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus