Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » సమంతతో స్క్రీన్ షేర్ చేసుకుంటానని మాత్రం ఊహించలేదు : విజయ్ దేవరకొండ

సమంతతో స్క్రీన్ షేర్ చేసుకుంటానని మాత్రం ఊహించలేదు : విజయ్ దేవరకొండ

  • May 8, 2018 / 12:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సమంతతో స్క్రీన్ షేర్ చేసుకుంటానని మాత్రం ఊహించలేదు : విజయ్ దేవరకొండ

“అర్జున్ రెడ్డి చిత్రం, ఆ చిత్ర విజయం.. ఒక నటుడిగా నాలో చాలా మార్పులు తీసుకొచ్చింది. నా ఇమేజ్ ను పెంచింది, కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకొనేలా చేసింది, ప్రపంచానికి నన్ను కొత్తగా పరిచయం చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా నా రెమ్యూనరేషన్ ని నేను డిసైడ్ చేసుకొనేలా చేసింది. ఇప్పుడు “మహానటి”లో నేను పోషించిన విజయ్ ఆంటోనీ అనే పాత్ర నాకు ఎలాంటి ఇమేజ్ తీసుకొస్తుంది అనే విషయం నేను పట్టించుకోవడం లేదు, ఆ కథకి నా పాత్ర, నా నటన ఎంతవరకూ ఉపయోగపడింది అనే విషయాన్ని మాత్రమే నేను పరిగణలోకి తీసుకొంటున్నాను” అంటున్నాడు యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ. రేపు తన పుట్టినరోజు మరియు “మహానటి” చిత్ర విడుదలను పురస్కరించుకొని తన పర్సనల్ లైఫ్ గురించి, సినిమా కెరీర్ గురించి, యాటిట్యూడ్ ఇష్యూస్ గురించి పాత్రికేయులతో ముచ్చటించాడు.

నాలో చాలా మార్పులొచ్చాయి…vijay-devarakonda-special-interview1“అర్జున్ రెడ్డి” విజయం తర్వాత నాలో ఏం మార్పు వచ్చింది అని అడిగితే.. చాలా వచ్చాయి అనే చెబుతాను. నేను ఇంటర్ లో ఉన్నట్లు, డిగ్రీకి వచ్చాక లేను. అలానే “ఎవడే సుబ్రమణ్యం” సినిమా టైమ్ లో ఉన్నట్లు “అర్జున్ రెడ్డి” తర్వాత లేను. అయితే.. వచ్చిన మార్పులన్నీ నా శారీరకంగా లేదా స్టేటస్ పరంగా వచ్చినవే తప్ప మానసికంగా నాలో ఎలాంటి మార్పులు రాలేదు. ఇక “అర్జున్ రెడ్డి” సినిమా విజయం సాధిస్తుంది అని ఊహించాను కానీ.. మరీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ అవుతుందని మాత్రం అస్సలు ఊహించలేదు.

జనాలు నన్ను చూసే పద్ధతి మారింది..vijay-devarakonda-special-interview2మోడీగారు డీమానిటైజేషన్ ఎనౌన్స్ చేసినప్పుడు “దిస్ మ్యాన్ గాట్ బాల్స్” అని స్టేటస్ అప్డేట్ చేశాను. అప్పుడు నన్ను ఒక సామాన్యుడిగా చూశారు కాబట్టి నేను అన్న మాటలకి పెద్దగా వేల్యూ ఇవ్వలేదు. కానీ.. నేను అందరికీ ఒక స్టార్ హీరోగా పరిచయమయ్యాక నేను సావిత్రిగారిని “చిక్” అనడం కూడా తప్పయిపోయింది. అందుకే ఆ ఇష్యూని అంత సీరియస్ గా తీసుకొని హడావుడి చేశారు. ఇక్కడ మారింది నా యాటిట్యూడ్ కాదు, జనాలు నన్ను చూసే పద్ధతి.

నేను బాధ్యత వహించలేను..vijay-devarakonda-special-interview3సినిమాలో నటించడం, కుదిరినంతలో ప్రమోట్ చేయడం వరకే నాకు తెలిసిన విషయం. సినిమా రిజల్ట్ ఏంటి? జనాలు ఎలా రిసీవ్ చేసుకొన్నారు? అనే విషయాన్ని నేను అస్సలు పట్టించుకోను. సినిమా రిజల్ట్ విషయంలో నేను బాధ్యత వహించాలి అని కూడా అనుకోను. ఎందుకంటే ఏ విషయానికైనా సరే బాధ్యత వహించడం అనేది నాకు నచ్చదు.

నన్ను సావిత్రిగా నటించమంటున్నారేమో అనుకున్నా..vijay-devarakonda-special-interview4“అర్జున్ రెడ్డి” షూటింగ్ లో ఉన్నప్పుడు స్వప్న అక్క ఫోన్ చేసి “సావిత్రి బయోపిక్ తీస్తున్నాం.. నువ్ యాక్ట్ చేయాలి” అని చెప్పింది. నేను నన్ను “సావిత్రి”గా యాక్ట్ చేయమని అడుగుతున్నారేమో అనుకొని.. “ఒకే నేను సావిత్రిగారిలా గెటప్ వేసుకుంటాను కానీ.. జనాలు చూస్తారా?” అని అడిగాను. గట్టిగా నవ్వేసింది అక్క.

నాగి కోసం మాత్రమే ఈ సినిమా చేశాను..vijay-devarakonda-special-interview6నా మనసుకి దగ్గరైన దర్శకుడు నాగి, నాకు అక్కలాంటి స్వప్న అడిగారు కాబట్టే “మహానటి”లో విజయ్ ఆంటోనీ రోల్ చేయడానికి అంగీకరించాను తప్పితే.. వేరే ఎవరైనా ఇదే సినిమా కోసం అప్రోచ్ నిస్సంకోచంగా నో చెప్పేవాడిని. ఈ సినిమాలో నా పాత్ర పెద్దదేమీ కాదు. సమంత క్యారెక్టర్ కు బ్యాక్ బోన్ లా ఉంటుంది అంతే.

సమంతతో కలిసి నటిస్తానని ఊహించలేదు..vijay-devarakonda-special-interview5నేను హీరో అవ్వడానికి ముందెప్పుడూ కూడా ఫలానా హీరోతో నటించాలి, ఫలానా హీరోయిన్ తో కలిసి నటించాలి అని మాత్రం ఎప్పుడూ బకెట్ లిస్ట్ లాంటిది తయారు చేసుకోలేదు. ముఖ్యంగా సమంతతో కలిసి నటిస్తాను అని మాత్రం ఎప్పుడూ ఊహించలేదు. తను నాకన్నా సీనియర్.. సో జూనియర్, జూనియర్ అంటూ ఆటపట్టించేది.

ఆ రోల్ చేయమని అడగ్గానే నాకు ప్యాక్ అయిపోయింది..vijay-devarakonda-special-interview7అప్పటికే నేను “మహానటి”లో విజయ్ ఆంటోనీ రోల్ చేశాను. సడన్ గా నాగి ఒకరోజు కాల్ చేసి “నాకు జెమిని గణేషన్ రోల్ కి దుల్కర్ డేట్స్ సెట్ అవ్వలేదు. ఆ క్యారెక్టర్ నువ్వే చేయాలి” అన్నాడు. నాకు ప్యాక్ అయిపోయింది. జెమిని గణేష్ సినిమాలు కొన్ని చూశాను. పొరపాటున కూడా ఆయనలా నటించలేని అని అర్ధమైపోయింది. కానీ.. చేయలేను, నో అని చెప్పలేను. ఎలా మేనేజ్ చేయాల్రా బాబు అని మాధానపడుతున్న తరుణంలో.. మళ్ళీ నాగి సడన్ గా కాల్ చేసి “దుల్కర్ డేట్స్ సెట్ అయిపోయాయి” అని చెప్పాడు. బ్రతికిపోయాన్రా బాబు అనుకున్నాను.

40 ఏళ్ల అర్జున్ రెడ్డి ఎలా ఉంటాడు అనే ఆలోచన..vijay-devarakonda-special-interview8“అర్జున్ రెడ్డి” హిట్ అయ్యాక ఆ సినిమాకి సీక్వెల్ తీయాలి అన్న ఆలోచన వచ్చింది. పెళ్లి చేసుకొని, ఒక అమ్మాయి పుట్టి, ఫ్యామిలీ మ్యాన్ లా బ్రతుకుతున్నప్పుడు అదే రకమైన యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తే.. వాడి కూతురు ప్రేమలో పడినప్పుడు అర్జున్ రెడ్డి ఎలా బిహేవ్ చేస్తాడు? అనే ఆలోచనతో సినిమా చేయాలన్న ఆలోచన ఉంది. అయితే.. అది అప్పుడే కాదు.. కొన్నేళ్లు ఆగిన తర్వాత మొదలెడతాను.

కాకినాడ స్లాంగ్ ను ఎలా రిసీవ్ చేసుకొంటారో..vijay-devarakonda-special-interview10బేసిగ్గా తెలంగాణ స్లాంగ్ నాకు బిగ్గెస్ట్ ఎస్సెట్. అయితే.. మొదటిసారిగా “డియర్ కామ్రేడ్” అనే చిత్రం కోసం కాకినాడ స్లాంగ్ ట్రై చేశాను. బిగ్ బెన్ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ రేపు విడుదలవుతుంది. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని భయంగా ఉన్నప్పటికీ.. “ట్యాక్సీవాలా” ఆ టెన్షన్ ను తగ్గిస్తుందని అనుకొంటున్నాను.

– Dheeraj Babu

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dulquer Salmaan
  • #Interviews
  • #keerthy suresh
  • #Mahanati Movie
  • #Nag Ashwin

Also Read

Kingdom First Review: విజయ్ దేవరకొండ ఊపిరి పీల్చుకున్నట్టేనా..!?

Kingdom First Review: విజయ్ దేవరకొండ ఊపిరి పీల్చుకున్నట్టేనా..!?

HariHara Veeramallu Collections: మొదటి సోమవారం 4 రెట్లు పడిపోయింది

HariHara Veeramallu Collections: మొదటి సోమవారం 4 రెట్లు పడిపోయింది

OG: ‘అఖండ 2’ కే ఎక్కువ ఛాన్సులు.. ‘ఓజి’ కి లైన్ క్లియర్

OG: ‘అఖండ 2’ కే ఎక్కువ ఛాన్సులు.. ‘ఓజి’ కి లైన్ క్లియర్

Naga Vamsi: నాగవంశీ చేతుల్లో ‘మిస్టర్ బచ్చన్’ హీరో, హీరోయిన్స్ భవిష్యత్తు..!

Naga Vamsi: నాగవంశీ చేతుల్లో ‘మిస్టర్ బచ్చన్’ హీరో, హీరోయిన్స్ భవిష్యత్తు..!

సతీ లీలావతి టీజర్: నవ్వులపల్లకిలో భార్యభర్తల బాట

సతీ లీలావతి టీజర్: నవ్వులపల్లకిలో భార్యభర్తల బాట

Mandala Murders Web Series Review in Telugu: “మండల మర్డర్స్” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Mandala Murders Web Series Review in Telugu: “మండల మర్డర్స్” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

Dulquer Salmaan: దుల్కర్ జాగ్రత్త పడకపోతే ప్రమాదం..!

Dulquer Salmaan: దుల్కర్ జాగ్రత్త పడకపోతే ప్రమాదం..!

Kingdom First Review: విజయ్ దేవరకొండ ఊపిరి పీల్చుకున్నట్టేనా..!?

Kingdom First Review: విజయ్ దేవరకొండ ఊపిరి పీల్చుకున్నట్టేనా..!?

Vijay Devarakonda: హాట్ టాపిక్ అయిన విజయ్ స్పీచ్.. అవి లేకుండానే..!

Vijay Devarakonda: హాట్ టాపిక్ అయిన విజయ్ స్పీచ్.. అవి లేకుండానే..!

Kingdom: ‘కింగ్డమ్’ … ఆ సన్నివేశాలకు కత్తెర..!

Kingdom: ‘కింగ్డమ్’ … ఆ సన్నివేశాలకు కత్తెర..!

Vijay Devarakonda: ‘కింగ్డమ్’ కథ 16 ఏళ్ళ క్రితం వచ్చిన విశాల్ ప్లాప్ సినిమాని పోలి ఉంటుందా?

Vijay Devarakonda: ‘కింగ్డమ్’ కథ 16 ఏళ్ళ క్రితం వచ్చిన విశాల్ ప్లాప్ సినిమాని పోలి ఉంటుందా?

Naga Vamsi: విజయ్ లో మార్పుకి కారణం నాగవంశీనా?

Naga Vamsi: విజయ్ లో మార్పుకి కారణం నాగవంశీనా?

trending news

Kingdom First Review: విజయ్ దేవరకొండ ఊపిరి పీల్చుకున్నట్టేనా..!?

Kingdom First Review: విజయ్ దేవరకొండ ఊపిరి పీల్చుకున్నట్టేనా..!?

2 hours ago
HariHara Veeramallu Collections: మొదటి సోమవారం 4 రెట్లు పడిపోయింది

HariHara Veeramallu Collections: మొదటి సోమవారం 4 రెట్లు పడిపోయింది

2 hours ago
OG: ‘అఖండ 2’ కే ఎక్కువ ఛాన్సులు.. ‘ఓజి’ కి లైన్ క్లియర్

OG: ‘అఖండ 2’ కే ఎక్కువ ఛాన్సులు.. ‘ఓజి’ కి లైన్ క్లియర్

5 hours ago
Naga Vamsi: నాగవంశీ చేతుల్లో ‘మిస్టర్ బచ్చన్’ హీరో, హీరోయిన్స్ భవిష్యత్తు..!

Naga Vamsi: నాగవంశీ చేతుల్లో ‘మిస్టర్ బచ్చన్’ హీరో, హీరోయిన్స్ భవిష్యత్తు..!

5 hours ago
సతీ లీలావతి టీజర్: నవ్వులపల్లకిలో భార్యభర్తల బాట

సతీ లీలావతి టీజర్: నవ్వులపల్లకిలో భార్యభర్తల బాట

7 hours ago

latest news

Mirai: ‘మిరాయ్’ కి అసలు సమస్య అదేనా..!

Mirai: ‘మిరాయ్’ కి అసలు సమస్య అదేనా..!

1 hour ago
కల్యాణ్‌ రామ్‌ హీరోయిన్‌కి కన్నడ హీరో ఫ్యాన్స్‌ బెదిరింపులు.. ఏమైందంటే?

కల్యాణ్‌ రామ్‌ హీరోయిన్‌కి కన్నడ హీరో ఫ్యాన్స్‌ బెదిరింపులు.. ఏమైందంటే?

2 hours ago
Nagarjuna: జపాన్‌లో నాగ్‌కి ఆ పేరు జోడిస్తూ సోషల్ మీడియా పోస్టులు.. ఏంటి స్పెషల్‌

Nagarjuna: జపాన్‌లో నాగ్‌కి ఆ పేరు జోడిస్తూ సోషల్ మీడియా పోస్టులు.. ఏంటి స్పెషల్‌

2 hours ago
Powerpeta: మూడు ముక్కల ‘పవర్‌ పేట’.. ఇప్పుడు మరో హీరో – నిర్మాత చేతుల్లోకి..

Powerpeta: మూడు ముక్కల ‘పవర్‌ పేట’.. ఇప్పుడు మరో హీరో – నిర్మాత చేతుల్లోకి..

2 hours ago
Tammareddy Bharadwaj: వాళ్లు ఎంత కాదన్నా.. ‘ఆ నలుగురు’ వాళ్లే: తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్‌

Tammareddy Bharadwaj: వాళ్లు ఎంత కాదన్నా.. ‘ఆ నలుగురు’ వాళ్లే: తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version