యంగ్ హీరో విజయ్ దేవరకొండ మొదటిసారిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్నటువంటి మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా లైగర్. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలా ఈ సినిమా విడుదల కావడంతో ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇక ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పూరి జగన్నాథ్ అలాగే బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించిన విషయం మనకు తెలిసిందే.
ఇకపోతే ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ దాదాపు 35 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఇకపోతే తాజాగా వీరి రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా నిర్మాణ సమయంలో బడ్జెట్ విషయంలో కాస్త ఇబ్బందులు తలెత్తగా విజయ్ దేవరకొండ తన రెమ్యూనరేషన్ మొత్తం సినిమా కోసం త్యాగం చేశారని తెలుస్తుంది. ఏదో ఫార్మాలిటీ కోసం ఏడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారని మిగతాది మొత్తం సినిమా హిట్ అయ్యి విజయం అయితేనే సినిమాలో వచ్చే లాభాలలో తనకు రెమ్యూనరేషన్ చెల్లించమని చెప్పారట.
ఈ విధంగా విజయ్ దేవరకొండ సినిమా కోసం తన రెమ్యూనరేషన్ త్యాగం చేశారని తెలియడంతో అభిమానులు ఈయనపై ప్రశంసల కురిపిస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా కనుక హిట్ కాకపోతే ఈయనకు రావలసిన మిగతా రెమ్యూనరేషన్ కూడా రాకపోవచ్చని తద్వారా సుమారు 20 కోట్లకు పైగా నష్టపోతారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే మాత్రం ఈ సినిమా భారీ ఓపెనింగ్ కైవసం చేసుకుంటుందని తెలుస్తోంది. ఏది ఏమైనా సినిమా కోసం విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ త్యాగం చేయడం చెప్పుకోదగ్గ విషయం.