Vijay Devarakonda: ఆ విజయ్‌ సినిమాలు ఆగిపోయాయా? సినిమాటోగ్రాఫర్‌ చెప్పిన విషయాలివే!

విజయ్‌ దేవరకొండ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా చేయకుముందు రెండు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ రెండు చాలా చిన్న పాత్రలే. గతంలో చేసిన రెండు సినిమాలు ‘పెళ్లి చూపులు’ బ్లాక్‌బస్టర్‌ తర్వాత బయటకు వచ్చిన విషయమూ తెలిసిందే. అయితే ఇలాంటి ‘రెండే’ కాదు.. మరో రెండు కూడా విజయ్‌ కెరీర్‌లో ఉన్నాయి. అందులో ఒక సినిమా గురించి కాస్త తెలిసినా.. ఇంకో సినిమా గురించి పెద్దగా తెలియదు. ఆ విషయాన్ని ‘ఖుషి’ సినిమా సినిమాటోగ్రాఫర్‌ జి.మురళి చెప్పారు.

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఖుషి’. ఈ సినిమా సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా మురళి విలేకర్లతో మాట్లాడుతూ విజయ్‌ గత సినిమాల గురించి ప్రస్తావించారు. ఇప్పుడు ఆ మాటలు వైరల్‌గా మారాయి. విజయ్‌ దేవరకొండతో తన అనుబంధం ఎప్పట్నుండో కొనసాగుతోందని చెప్పిన మురళి.. ‘అందాల రాక్షసి’ తర్వాత ఆయనతోనే సినిమా చేయాల్సి ఉందని చెప్పారు. అయితే అనుకోకుండా అలా రెండు సినిమాలు మొదలై, ఆగిపోయాయని చెప్పారు.

‘అందాల రాక్షసి’ సినిమా తర్వాత విజయ్‌ కోసం ఓ సినిమా అనుకున్నారట. దానికి మురళి సినిమాటోగ్రఫీ చేయాల్సి ఉందట. అయితే కొన్ని నెలల ప్రయాణం తర్వాత ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లకుండానే ఆగిపోయిందట. అక్కడికి కొన్ని నెలల తర్వాత విజయ్‌ కథానాయకుడిగా ‘హీరో’ అనే సినిమా మొదలైందట. దాని కోసం మురళి పని చేశారట. అయితే ఒక షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత ఆ సినిమా కూడా ఆపేశారు. ఆ సినిమాకు నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్సే.

అలా ‘ఖుషి’ సినిమాతో మూడోసారి (Vijay Devarakonda) విజయ్‌తో పని చేసే అవకాశం వచ్చిందని, ఇప్పుడు ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉందని మురళి చెప్పారు. ‘హీరో’ సినిమాకు ఆనంద్‌ అనే దర్శకుడు డైరెక్ట్ చేయాలి. ‘లైగర్‌’ కోసం ఆ సినిమాను విజయ్‌ వదులుకున్నారని అంటారు. మరి ఈ పట్టాలెక్కకుండా ఆగిపోయిన సినిమా ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus