విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)… ఇప్పుడు స్టార్ హీరో కావొచ్చు. స్టార్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుండొచ్చు. ఫ్యామిలీ మొత్తం మంచి లైఫ్‌ను లీడ్ చేస్తుండొచ్చు. అయితే ఆయన కొన్నేళ్ల క్రితం వరకు మిడిల్ క్లాసే అని చెప్పాలి. ఇప్పుడు ఆయన అలాంటి పాత్రలోనే ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు మాట్లాడాడు. ఇప్పుడు ఆ విషయాలు వైరల్‌గా మారుతున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కథానాయిక కాగా, పరశురామ్ (Parasuram)దర్శకుడు.
ఏప్రిల్ 5న ‘ఫ్యామిలీ స్టార్’ను రిలీజ చేస్తున్నారు. ఇందులో భాగంగానే విజయ్ యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఈ క్రమంలోనే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి విజయ్ మాట్లాడాడు. కెరీర్ పరమైన చాలా విషయాలు నాన్నతో, వ్యక్తిగత విశేషాలను అమ్మతో షేర్ చేసుకుంటాడట. తమ్ముడు ఆనంద్ దేవరకొండకు (Anand Devarakonda) అన్నీ చెబుతాడట. స్కూల్లో చదువుకునేటప్పుడు సైకిల్ కావాలని నాన్నను అడిగితే తర్వాత బర్త్‌డేకు కొంటానంటూ కొన్ని రోజులు, సెలవుల్లో తీసుకుంటానని కొన్ని రోజులు చెప్పేవారట.
అలా చాలా రోజుల తర్వాత సైకిల్ కొన్నారట. ఆ సైకిలే కాదు టీవీ, వీడియో గేమ్, కంప్యూటర్.. ఇలా చిన్నతనంలో ఆసక్తి ఉన్న చాలా వస్తువులు, వసతలు కొనాలనుకున్నా కొనలేకపోయారట. దానికి కారణం కుటుంబ ఆర్థిక పరిస్థితులే అని చెప్పాడు విజయ్ దేవరకొండ. దీంతో సర్దుకుపోవాల్సి వచ్చేది అని చెప్పాడు. లైఫ్‌లో అడ్జస్ట్‌మెంట్ అనేది ఓ పాఠమని, ఇప్పటికీ ఏదో విషయంలో సర్దుకుపోతుంటానని రౌడీ హీరో తెలిపాడు.
మనకు కావాల్సింది దక్కకపోయినా లైఫ్‌లో ఎలా ముందుకెళ్లాలో నేర్చుకున్నాను అని విజయ్ చెప్పాడు. ‘ఫ్యామిలీ స్టార్’, ‘ఖుషి’ (Kushi) సినిమాల్లో ఏది ఇష్టం అని అడిగితే… ఫ్యామిలీ స్టార్ పేరు చెప్పాడు. బిర్యానీ, ముద్దపప్పు.. ఏది ఫేవరెట్ అంటే… బిర్యానీ అని చెప్పాడు. మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మీరే హ్యాండిల్ చేస్తారా? అని అడిగితే… నా టీమ్ యాక్టివ్‌గా ఉంటుంది. అప్‌డేట్స్ నాతో పంచుకుంటుంది అని తెలిపాడు.