విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఇటీవల ‘ఫ్యామిలీ స్టార్’ తో (Family Star) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘గీత గోవిందం’ (Geetha Govindam) కాంబో కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ వాటిని ‘ఫ్యామిలీ స్టార్’ అందుకోలేకపోయింది. అయినప్పటికీ ఇది మరీ తీసిపారేసే మూవీ కాదు. సోషల్ మీడియాలో ఈ సినిమా పై చాలా మంది నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. విజయ్ దేవరకొండ కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన టైం ఇది.
అందుకే ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటున్నాడు. ‘జెర్సీ’ (Jersey) దర్శకుడు గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు విజయ్. మరో పక్క ‘రాజావారు రాణిగారు’ (Raja Vaaru Ranigaaru) ఫేమ్ రవికిరణ్ కోలా (Ravi Kiran Kola) దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో పాటు తనకి ‘టాక్సీ వాలా’ (Taxiwaala) వంటి హిట్ ఇచ్చిన రాహుల్ సంకృత్యన్ తో (Rahul Sankrityan) కూడా ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు విజయ్. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది.
అయితే ఈ కథ గురించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ముందుగా ఈ కథని తమిళ స్టార్ హీరోలు అయిన సూర్య (Suriya) , కార్తీ (Karthi)..లకు వినిపించాడట. వాళ్లకి కూడా ఈ కథ నచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారట. దీంతో విజయ్ కి వినిపించి ఓకే చేయించుకున్నాడు రాహుల్ సంకృత్యన్.
అలాగే విజయ్ ఇమేజ్ కి తగ్గట్టు కొన్ని మార్పులు కూడా చేశాడట. ఇది కూడా ‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singha Roy) మాదిరి పీరియాడికల్ మూవీ అని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ రెండు రకాల షేడ్స్ కలిగిన పాత్రలో కనిపించబోతున్నట్టు కూడా వినికిడి.