విజయ్ దేవరకొండ చాలా కాలంగా ఓ సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. అది గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేసే సినిమానే అని అతని అభిమానులు నమ్మారు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థపై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ‘#VD12’ వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతూ వచ్చిన ఈ సినిమాకి ‘కింగ్డమ్’ (Kingdom) అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేశారు. అలాగే కొద్దిసేపటి క్రితం టీజర్ ని కూడా వదిలారు.
ఇక ‘కింగ్డమ్'(Kingdom) టీజర్ విషయానికి వస్తే.. ఇది 1:55 నిమిషాల నిడివి కలిగి ఉంది. ‘అలసట లేని భీకర యుద్ధం. అలలుగా పారే ఏరుల రక్తం. వలసపోయినా.. అలిసిపోయినా.. ఆగిపోనిది ఈ మహా రణం. నేలపైన దండయాత్రలు,మట్టి కింద మృతదేహాలు… ఈ అలజడి ఎవరి కోసం? ఇంత భీభత్సం ఎవరి కోసం?అసలు ఈ వినాశనం ఎవరి కోసం? రణ భూమిని చీల్చుకుని పుట్టే కొత్త రాజు కోసం.! కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మ నెత్తిన నాయకుడి కోసం..!’ అంటూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్లో టీజర్ మొదలైంది.
టీజర్ మొత్తం రక్తపాతం, నిస్సహాయ స్థితిలో ఉన్న జనాలు కనిపించారు. వారి కోసం వచ్చే రాజు.. హీరో అని స్పష్టమవుతుంది. ‘ఏమైనా చేస్తా సార్, అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్’ అంటూ విజయ్ దేవరకొండ చెప్పే డైలాగ్ క్యాచీగా ఉంది. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ కి హైలెట్ అని చెప్పవచ్చు. మొత్తంగా టీజర్ ఆకర్షించే విధంగా ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :