Vijay Sethupathi: విజయ్ సేతుపతి.. నిజంగా 700 కోట్లు తెస్తాడా?

కోలీవుడ్ టాలెంటెడ్ నటుడు విజయ్ సేతుపతి  (Vijay Sethupathi)  ల్యాండ్‌మార్క్ మూవీ మహారాజా సాధించిన ఘనవిజయం అందరికీ తెలిసిందే. యంగ్ డైరెక్టర్ నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారింది. థియేటర్స్‌లో 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి, సూపర్‌హిట్ టాక్‌తో దూసుకుపోయింది. థియేట్రికల్ సక్సెస్‌తో పాటు ఓటీటీలో కూడా ఈ సినిమా రికార్డు స్థాయిలో వ్యూస్ తెచ్చుకుని, ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మహారాజా చైనా బాక్సాఫీస్‌ని టార్గెట్ చేస్తోంది.

Vijay Sethupathi

నవంబర్ 29న చైనాలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం 40,000 స్క్రీన్స్‌లో రాబోతుందని టాక్. యిషి ఫిల్మ్స్, అలీబాబా పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాయి. చైనాలో ఇప్పటికే స్పెషల్ ప్రీమియర్ షోకు మంచి స్పందన రావడం, లక్షా 30 వేల డాలర్ల వసూళ్లు రాబట్టడం ఆసక్తిని మరింత పెంచుతోంది. తండ్రీకూతుళ్ల ఎమోషనల్ స్టోరీలైన్, సెంటిమెంట్‌కు చైనా ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అవుతారన్న విశ్వాసంతో ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.

గతంలో దంగల్, సీక్రెట్ సూపర్‌స్టార్ వంటి ఎమోషనల్ డ్రామాలు చైనాలో భారీ విజయాలు సాధించడం తెలిసిందే. అదే తరహాలో మహారాజా కూడా విజయ్ సేతుపతి అద్భుతమైన నటనతో ఆడియన్స్‌ని కట్టిపడేస్తుందని ట్రేడ్ అనలిస్టులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీ దంగల్ 1300 కోట్ల గ్రాస్‌తో దూసుకెళ్లింది.

అయితే, 40,000 స్క్రీన్స్‌లో రిలీజ్ అవుతున్న మహారాజా ఆ రేంజ్‌లో కాకపోయినా, రూ. 700 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉందని అంచనా. కంటెంట్‌ బలం, ఎమోషనల్ కనెక్ట్ రెండూ కలిసి వర్కౌట్ అయితే, మహారాజా చైనా బాక్సాఫీస్‌పై కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహారాజా విజయంతో విజయ్ సేతుపతి అంతర్జాతీయ మార్కెట్‌లో తన స్థాయిని మరింత పెంచుకునే అవకాశముంది. మరి ఈ ప్రయాణం ఎంత వరకు విజయవంతమవుతుందో వేచి చూడాలి.

కిస్సిక్.. 24 ఏళ్ళ ఈ సింగర్ ఎవరు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus