తెలంగాణ ఉద్యమంలో సినీ ఇండస్ట్రీ పాత్ర గురించి అలాగే ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి.. విజయశాంతి గురించి మాట్లాడిన తీరు గురించి తాజాగా విజయశాంతి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. అప్పట్లో వీళ్లది హిట్ పెయిర్. ఇద్దరూ పోటీ పడి డ్యాన్సులు వేసేవారు. వీళ్ళ పెయిర్ కు మంచి క్రేజ్ ఉంది. వీళ్ళ కాంబోలో సినిమా వచ్చింది అంటే అది సూపర్ హిట్ అవుతుందని అంతా అనుకునేవారు. వారు అంచనా వేసినట్టే వీళ్ళ కాంబోలో వచ్చిన సినిమాలు దాదాపు హిట్లయ్యాయి.
అయితే ‘గ్యాంగ్ లీడర్’ సినిమా హిట్ అయిన తర్వాత.. అలాగే తెలంగాణ ఉద్యమం మొదలైన టైములో వీరి మధ్య గ్యాప్ ఏర్పడింది. ఆ విషయాలపై ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ వేడుకలో విజయశాంతి గురించి చిరంజీవి మాట్లాడినప్పుడు విజయశాంతి కాంట్రవర్షియల్ గా ఏమీ మాట్లాడలేదు. దానికి గల కారణాలను కూడా విజయశాంతి వివరించారు. ఆమె మాట్లాడుతూ.. “ఇప్పుడంటే ప్రీ రిలీజ్ వేడుకల్ని ఘనంగా చేస్తున్నారు కానీ అప్పట్లో రూ.100 రోజులు, రూ.175 రోజుల ఫంక్షన్లను ఘనంగా చేసుకునేవాళ్ళం.
అయితే అప్పుడు.. ఇప్పుడు అభిమానులు అలాగే ఉన్నారు. కాకపోతే సినిమా రిలీజ్ కు ముందు ఈవెంట్‌లు అంటే కాస్త కొత్తగా ఉంది. ఇప్పటి జనరేషన్, ప్యాట్రన్ కూడా డిఫరెంట్‌గా అనిపిస్తుంది.ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి అలా మాట్లాడుతారని నేను ఊహించలేదు.కానీ ఆయినా ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. అలాగే సరిలేరు నీకెవ్వరు ఈవెంట్‌లో కూడా మాట్లాడారు అనుకుంటున్నాను. అందుకనే నేను కూడా అలా మాట్లాడాను. నిజానికి అప్పటికి చిరంజీవిగారు నాతో మాట్లాడి 20 ఏళ్ళు అయ్యింది.దాని గురించి మాత్రం ఆయన మాట్లాడింది లేదు.
సినిమాల్లో నటించేటప్పుడు మామూలుగానే మాట్లాడుకునేవాళ్లం. అయితే రాజకీయాలన్న తర్వాత కొంత సీరియెస్‌నెస్ ఉంటుంది. ఏదో తిట్టుకున్న తర్వాత మళ్లీ మాట్లాడుకోవాలనేం లేదుగా. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన రోజుల్లో సినీ పరిశ్రమ నుండీ ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు. రాజకీయాలనేవి వేరు. తెలంగాణ ఉద్యమం అనేది బర్నింగ్ ఇష్యూగా తయారయ్యింది ఆ టైములో. కాబట్టి ఇండస్ట్రీ నుండీ సపోర్ట్ చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆ సబ్జెక్ట్ గురించి ఇప్పుడు మాట్లాడితే భయంకరంగా ఉంటుంది.
తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నప్పుడు సపోర్ట్ చేయమని అడిగితే తప్పేముంది.. కానీ ఎవరూ స్పందించలేదు. అందుకనే ఓ ఘర్షణ వాతావరణం నెలకొంది. తెలంగాణ ప్రజలు చనిపోతున్నారు. అందుకు సపోర్ట్ చేయమన్నప్పుడు సినీ పరిశ్రమ నుండీ ఎవ్వరూ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు” అంటూ విజయశాంతి చెప్పుకొచ్చారు.