టాలీవుడ్ లోని ప్రముఖ స్టార్ రైటర్లలో విజయేంద్ర ప్రసాద్ ఒకరనే సంగతి తెలిసిందే. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ సాధించడంతో ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ పేరు మారుమ్రోగుతోంది. చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో మెప్పిస్తే తారక్ కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా నటించారు. అయితే కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ రామరాజు పాత్రలో నటిస్తే భీమ్ పాత్రకు చరణ్ ను తీసుకుని ఉంటే బాగుండేదని కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఒక ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తారక్ రామరాజు పాత్రకు సూట్ అవుతాడని భీమ్ పాత్రకు చరణ్ మాత్రం సూట్ కాడని ఆయన వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ షూట్ మొదలైన సమయంలోనే ఈ చర్చలు జరిగాయని ఆయన అన్నారు. కళ్లతో ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చే పాత్రకు చరణ్ సూట్ అవుతాడని చరణ్ లో భీమ్ పాత్రలో ఉండే మొరటుతనం లేదని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై 11 రోజులవుతున్నా ఈ సినిమా ప్రభంజనం ఆగడం లేదు.
ఫుల్ రన్ లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లుస్ సాధిస్తుందో చూడాల్సి ఉంది. కేజీఎఫ్2 సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రమే ఆర్ఆర్ఆర్ కలెక్షన్లపై ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ ఫుల్ రన్ లో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ది కశ్మీర్ ఫైల్స్ నుంచి పోటీ లేకుండా ఉండి ఉంటే హిందీలో ఈ సినిమా మరింత మెరుగైన కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే ఉంటాయి.
ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో చరణ్, తారక్ జోష్ లో ఉన్నారు. భవిష్యత్తు ప్రాజెక్టులతో కూడా కెరీర్ బెస్ట్ హిట్లు అందుకోవాలని ఈ స్టార్ హీరోలు కోరుకుంటున్నారని తెలుస్తోంది.